Politics

బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి – TNI రాజకీయ వార్తలు

బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి  – TNI  రాజకీయ వార్తలు

*వరంగల్ డిక్లరేషన్‌తో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ చెబితే తాము గజ్వేల్‌లో మీటింగ్ పెడతామా? అని ప్రశ్నించారు. తమ బహిరంగ సభ ముందు.. బీజేపీ బహిరంగసభలు పనికిరావన్నారు. గజ్వేల్, సిరిసిల్లలో బీజేపీకి మీటింగ్ పెట్టే దైర్యం లేదని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు పొత్తు ఉండదని గతంలోనే చెప్పామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు.

* నా ప్రమాణం ముస్లింల అభివృద్ధికి మాత్రమే కాదు : నఖ్వీ
భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ భవితవ్యంపై అనేక ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలని బీజేపీ అధిష్ఠానం గట్టిగా ఆలోచిస్తున్నప్పటికీ, అందుకు ఆ పార్టీలోని కొందరు సీనియర్లు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అంతే గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనను జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగియడంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పార్టీ నుంచి ఎటువంటి హామీ లభించలేదని చెప్పారు.బీజేపీలో సుప్రసిద్ధ ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ఆయన 17 ఏళ్ల వయసు నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. దాదాపు 47 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో సేవలందిస్తున్నారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. తాను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా మైనారిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేశానని చెప్పారు. ఉప రాష్ట్రపతి లేదా జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ – ఈ రెండు పదవుల్లో దేనిని తనకు ఇస్తారో తనకు తెలియదని చెప్పారు.

* రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ధారూర్ మండలం బాచారం వాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను బుధవారం ఆమె పరిశీలించారు.ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై క్షేత్ర స్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నదుల వద్ద పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాలని, ప్రవాహ వేగాలు గమనించకుండా వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.మంత్రితో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్ , పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు

* కార్మికులు తక్షణమే విధులకు హాజరుకావాలి: మంత్రి Suresh
మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమింపచేసుకొని చర్చలలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం ఉదయం నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులు డిమాండ్లను ఒకటి తప్ప అన్ని పరిష్కరించామన్నారు. రూ.18 వేల వేతనం చట్టబద్ధత కాదని తెలిపారు. దానిపై కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కార్మికులు తక్షణమే విధులకు హాజరుకావాలని మంత్రి ఆదిమూలపు సురేష్ విజ్ణప్తి చేశారు

* మద్యం ఆదాయ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలి: TDP
మద్యం ఆదాయ కుంభకోణంపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నామని టీడీపీ నేత డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… 30 శాతం జెటాక్స్ రూపేణా జగన్ జేబుల్లోకి అక్రమ మద్యం ఆదాయం వెళ్తోంది కాబట్టే డిజిటల్ లావాదేవీలు పెట్టలేదని విమర్శించారు. మద్యంలో విషపూరిత రసాయనాలు ఉన్నాయని తాము నివేదికలు విడుదల చేస్తే ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు. అవసరం అయితే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ సర్కారు వచ్చిన తరువాతే రాష్ట్రంలో 106 మద్యం బ్రాండ్స్ వచ్చాయని డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు

* చెప్పే మాటలు నేతి బీరలో నెయ్యి చందం: Yanamala
సీఎం జగన్ రెడ్డి చెప్పే మాటలు నేతబీరకాయలో నెయ్యి చందంలా ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ రెడ్డికి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంపై లేదని పేర్కొన్నారు. సామాజిక న్యాయంపై, సమసమాజ, నవ సమాజ స్థాపనలపై జగన్ రెడ్డికి చిత్తశుద్ది లేదన్నారు. జగన్ రెడ్డి చెబుతున్న సామాజిక న్యాయం పెద్ద బూటకమన్నారు. జగన్ చేస్తున్న సామాజిక న్యాయం కంటే ఆయన చేసిన సామాజిక అన్యాయమే ఎక్కువని యనమల పేర్కొన్నారు. ప్రతీ సంక్షేమ పథకంలో నిబంధనలు పెట్టి లక్షలాది మందిని తొలంగించారని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీలపై దాడులు, హత్యలు చేయించారన్నారు. సామాజిక న్యాయం కోసం మూడు సంవత్సరాలలో జగన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. జగన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా సంక్షేమంలో పెట్టిన కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల పేర్కొన్నారు

*పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది: Revanth
తెలంగాణ లో పేద పిల్లల చదువుకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ట్విటర్వే దికగా విమర్శించారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది. ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ‘మన ఊరు – మన బడి’ ఓ ప్రచారార్భాటం. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయం’’ అని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

*YCPపై పవన్ అభాండాలు వేస్తున్నారు: కాకాని
వైసీపీ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్అ భాండాలు వేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీసీఆర్సీ సర్టిఫికేట్, పాస్‌బుక్ ఉన్నా ఏ రైతుకైనా.. నష్ట పరిహారం ఇవ్వలేదని నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. కంది పంటను కూడా గుర్తుపట్టలేని టీడీపీ నేత లోకేష్ , సీఎం జగన్‌కు లేఖలు రాస్తున్నారని ఎద్దేవాచేశారు. పంటలు దెబ్బతిన్న చోట 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని ప్రకటించారు. సీజన్ ముగిసే లోపు ఇన్‌పుట్ సబ్సిడీ అందజేస్తామని కాకాని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

*రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు: Shailajanath
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ( తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వరదలకు సహాయం లేకపోవడం, సకాలంలో జీతాలకు నిధులు రాకపోవడం, రోడ్లు వేయలేకపోవడం, ప్రత్యేక హోదా సాధించుకోక పోవడం సీఎం వైఫల్యానికి నిదర్శనమన్నారు. జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులు సాధించుకోవాలన్న మాట కూడా రావడంలేదని ఆరోపించారు. జగన్‌ను ఎన్నుకున్నది సీఎం హోదాతో ఆయన ఎంజాయ్ చేయడానికో.. సొంత విషయాలు మాట్లాడుకోవడానికి కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి అడక్కుండానే ఎగబడి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

*Jagan చెప్పే మాటలు నేతి బీరలో నెయ్యి చందం: Yanamala
సీఎం జగన్ రెడ్డి చెప్పే మాటలు నేతబీరకాయలో నెయ్యి చందంలా ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ రెడ్డికి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంపై లేదని పేర్కొన్నారు. సామాజిక న్యాయంపై, సమసమాజ, నవ సమాజ స్థాపనలపై జగన్ రెడ్డికి చిత్తశుద్ది లేదన్నారు. జగన్ రెడ్డి చెబుతున్న సామాజిక న్యాయం పెద్ద బూటకమన్నారు. జగన్ చేస్తున్న సామాజిక న్యాయం కంటే ఆయన చేసిన సామాజిక అన్యాయమే ఎక్కువని యనమల పేర్కొన్నారు. ప్రతీ సంక్షేమ పథకంలో నిబంధనలు పెట్టి లక్షలాది మందిని తొలంగించారని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీలపై దాడులు, హత్యలు చేయించారన్నారు. సామాజిక న్యాయం కోసం మూడు సంవత్సరాలలో జగన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. జగన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా సంక్షేమంలో పెట్టిన కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల పేర్కొన్నారు.

*కార్మికులు తక్షణమే విధులకు హాజరుకావాలి: మంత్రి Suresh
మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమింపచేసుకొని చర్చలలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్అ న్నారు. బుధవారం ఉదయం నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులు డిమాండ్లను ఒకటి తప్ప అన్ని పరిష్కరించామన్నారు. రూ.18 వేల వేతనం చట్టబద్ధత కాదని తెలిపారు. దానిపై కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కార్మికులు తక్షణమే విధులకు హాజరుకావాలని మంత్రి ఆదిమూలపు సురేష్ విజ్ణప్తి చేశారు.

*జాతీయ చిహ్నంపై అనవసర రాద్ధాంతం: Lanka dinakar
నూతన పార్లమెంట్ భవన నిర్మాణం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం పైన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్మం డిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… విగ్రహంలో సింహం గుణగణాలను మార్చారని విమర్శ చేసే వారికి సద్గుణం ప్రాప్తించాలని కోరుకున్నారు. విగ్రహం పరిమాణం పెరిగినప్పుడు గంభీరంగా కనబడడం సహజం, సింహం గుణగణాలు ఎక్కడైన మారిపోతాయా అని ప్రశ్నించారు. “సత్యమేవ జయతే నుంచి సింహమేవ జయతే” కి మారింది అనేవారు, రేపు అసలు సింహాలేందుకు అన్నా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యలు చేశారు. విమర్శించడానికి అవకాశం లేనప్పుడు ఇటువంటి ప్రచారాలు చేస్తారని లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ప్రజలు తిరగబడకముందే అరాచకాలు మానండి: లోకేశ్‌
ప్రజలు తిరగబడకముందే కబ్జాలు, అరాచకాలు మానండి అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ముఖ్యమంత్రిని హెచ్చరించారు. మంగళవారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఓటు వేయకపోతే వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్‌ డెమొక్రసీ. ఎన్నికలై చాలా రోజులైనా టీడీపీకి ఓట్లు వేశారనే కక్షతో ప్రకాశం జిల్లా గానుకపెంటలో మర్రి శ్రీను అనే మేకల కాపరి ఇంటినే కబ్జా చేశారు. ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్‌రెడ్డి గారూ’ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

*జగన్‌రెడ్డి కంటే జేబు దొంగలు నయం: అంగర
జగన్‌రెడ్డి ప్రభుత్వం కంటే జేబు దొంగలు నయమని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు విమర్శించారు. మంగళవారం ఆయన టీడీపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించే ప్రతిసారీ పేదల ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పడమే తప్ప చేస్తున్నదేమీ లేదన్నారు. మూడేళ్లలో 4 శాతం ఇళ్లనే పూర్తి చేశారని తెలిపారు. ఆ ఇళ్ల స్థలాల చదును పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రూ. 7వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు.

*సీఐడీ… రాజ్యాంగం మేరకు నడుచుకోవాలి: వర్ల
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఐడీ పోలీసులు చట్టపరమైన బాధ్యతలను మరిచిపోయి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వ్యక్తిగత సైన్యంలా పని చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. సీఐడీ తన విధులను రాజ్యాంగం ప్రకారం, ఏపీ పోలీసు మాన్యువల్‌లో నిర్దేశించిన ప్రకారం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐడీ ఏడీజీకి మంగళవారం ఆయన లేఖ రాశారు.

*మోదీ, జగన్‌లను గద్దె దించాలి: రామకృష్ణ
కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డిలను గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మంగళవారం నిర్వహించిన జిల్లా సీపీఐ ప్రథమ మహాసభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వాలు కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచుతూ బీజేపీ దగా చేస్తున్నదన్నారు. అలాగే అమ్మఒడి, రైతుభరోసా, వాహన మిత్ర, చేయూత అంటూ అమాయక ప్రజలకు డబ్బులు ఎరవేసి అందిన కాడికి జగన్‌ దోచుకుంటున్నాడని ఆరోపించారు.

*రుణ యాప్‌లను బ్లాక్‌ చేయండి: వాసిరెడ్డి పద్మ
ఆన్‌లైన్‌ రుణ యాప్‌ల ద్వారా తేలికగా రుణాలు అంటగట్టి వడ్డీల మీద వడ్డీలు వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్న రుణ యాప్‌లను బ్లాక్‌ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసినట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుణ యాప్‌లను తొలగించేందుకు వెంటనే ప్లేస్టోర్‌లను సంప్రదించాలని సూచించారు. రుణ యాప్‌ల నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రుణ యాప్‌ల వేధింపులపై మహిళా కమిషన్‌కు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

*ముర్ముకు టీడీపీ మద్దతు శోచనీయం-పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి
రాష్ట్రానికి తీరని ద్రోహం, అన్యాయం, మోసం చేసిన బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతివ్వడం శోచనీయమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి నంబర్‌ 1 ద్రోహి బీజేపీ అన్నారు. ప్రత్యేక హోదాకు పంగనామం పెట్టిందని, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యే క అభివృద్ధి ప్యాకేజీకి తిలోదకాలిచ్చిందన్నారు. బీజేపీకి టీడీపీ మద్దతివ్వడం రాష్ట్రానికి ద్రోహమే అవుతుందన్నారు. రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటే బీ అంటే బాబు, జే అంటే జగన్‌, పీ అంటే పవన్‌ అని తులసిరెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు.

*కేసీఆర్‌ పని అయిపోయింది: విజయశాంతిt
తెలంగాణాలో సీఎం కేసీఆర్‌ పని అయిపోయిందని మాజీ ఎంపీ విజయశాంతి స్పష్టం చేశారు. ‘కొందరిని ఎల్లకాలం మోసం చేయవచ్చు. అందరినీ కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు’ అనే నానుడి కేసీఆర్‌ విషయంలో నూరు శాతం నిజమవుతోందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ మోసాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారని, ఇక ఆయన్ను ఇంటికి సాగనంపాలని డిసైడ్‌ అయ్యారని ట్విటర్‌ వేదికగా విజయశాంతి తెలిపారు. ఇది గుర్తించే బీఆర్‌ఎస్‌ పేరిట జాతీయ పార్టీ అంటూ కేసీఆర్‌ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారన్నారు.

*పారదర్శకంగా దళిత బంధు: మంత్రి కొప్పుల
దళిత బంధు పథకాన్నిపారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటలనో ఆయన వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 28,970 మంది లబ్దిదారులను ఎంపిక చేశామని, రూ.3,100 కోట్లు విడుదల చేశామని తెలిపారు. దళిత బంధు పథకం అములకు తమ ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్లో రూ.17,700 కేటాయించిందని, రాష్ట్రంలోని 19 లక్షల దళిత కుటుంబాలకు వచ్చే ఏడేళ్లలో పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని వివరించారు. ఇందులో ఎటువంటి అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం లేదని లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

*ప్రధాని మోదీకి నా అభినందనలు: చంద్రబాబు
రాష్ట్రపతి ఎంపికలో టీడీపీ భాగస్వామ్యం తమ అదృష్టమని టీడీపీ అధినేత చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేద కుటుంబంలో పుట్టిన ముర్ము ఎంతో కష్టపడి పైకొచ్చారని కొనియాడారు. ఎస్టీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఇవాళ విజయవాడలో తాజ్ గేట్ వే హోటల్‌కు చేరుకున్న ముర్ముకు చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్‌గా ముర్ము సేవలందించారని తెలిపారు. ఆదివాసీలు, పేదల అభివృద్ధి కోసం ఆమె కృషి చేసిందన్నారు. ముర్ము నిరాడంబరత చాలా గొప్పదన్నారు. సామాజిక న్యాయం కోసమే ముర్ముకు మద్దత్తు ఇచ్చామన్నారు. సాధారణ పౌరులు అసాధారణ పదవికి ఎన్నిక కావటం మన రాజ్యాంగం విశిష్టత అన్నారు. కేఆర్ నారాయణన్‌, అబ్దుల్‌కలాం, రామ్‌నాథ్‌కోవింద్, ముర్ములు రాష్ట్రపతిగా ఎంపికలో భాగస్వామి కావడం తన అదృష్టమన్నారు.

*నెలాఖరులోగా విద్యాకానుక కిట్లు: మంత్రి బొత్స
‘మన బడి నాడు-నేడు’ పథకంలో భాగంగా పాఠశాలలో చేపట్టిన రెండో దశ పనులను సకాలంలో పూర్తిచేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. నాడు-నేడు, విద్యా కానుకపై విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో మంగళవారం మంత్రి సమీక్షించారు. నెలాఖరులోగా విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయాలన్నారు.

*కేసీఆర్‌ నిర్దేశంలో కాంగ్రెస్‌ డ్రామాలు
సీఎం కేసీఆర్‌ మార్గ నిర్దేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమాలు చేస్తున్న రోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ సైతం అదే పనిగా కార్యక్రమాలు చేపట్టడం సిగ్గు చేటని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమాలతో బీజేపీకి పేరొస్తుంటే ఓర్వలేని సీఎం కేసీఆర్‌, అదే సమయంలో కాంగ్రెస్‌ సైతం కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను తగ్గించేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపట్టిన రోజే కాంగ్రెస్‌ కార్యక్రమాలు చేపట్టిందని.. నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించిన రోజే పోటీగా కాంగ్రెస్‌ గజ్వేల్‌ సభ నిర్వహించిందని గుర్తు చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ ఏడాది కాలంలో ప్రజల పక్షాన బీజేపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన అనేకసార్లు పోటీగా కాంగ్రెస్‌ కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు. ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌ మార్గ నిర్దేశంలో కాంగ్రెస్‌ ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. గతంలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేసిన ఆందోళనలకు కాంగ్రెస్‌ పలుమార్లు మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పారు. ప్రజలు టీఆర్‌ఎ్‌స-కాంగ్రెస్‌ కుట్రలను అర్థం చేసుకుని తగిన గుణపాఠం చెప్పాలని సంజయ్‌ ఒక ప్రకటనలో కోరారు.