DailyDose

నూతన రాష్ట్రపతి ఎన్నికకు ఏపీ అసెంబ్లీలో ఏర్పాట్లు – TNI తాజా వార్తలు

నూతన రాష్ట్రపతి ఎన్నికకు ఏపీ అసెంబ్లీలో ఏర్పాట్లు – TNI  తాజా వార్తలు

* భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలు 2022లో జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జులై 18న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలో దింపగా.. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడుతున్నారు. ఇక 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు 50 మందికి పైగా అసెంబ్లీ సిబ్బందిని కేటాయించారు. అంతకంటే ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.

* సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్, అతని గ్యాంగ్ పర్యావరణ విధ్యంసానికి పాల్పడుతోందని ఆరోపించారు.చెట్లని నరికేస్తే పెంచొచ్చు.. కాని కొండల్ని తవ్వేస్తే ఎలా? అని సీఎంను ప్రశ్నించారు.‘‘చారిత్రాత్మక విశాఖ రుషికొండను కనుమరుగు చేయటం బరితెగింపే. పర్యావరణ విధ్వంసానికి జగన్‌కు అధికారం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 శాతం అడవుల్ని నాశనం చేశారు. ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వ్యక్తులు ముఖ్యం కాదు. సమాజమే శాశ్వతం. రవ్వల కొండను తవ్వేశారు. భారతీ సిమెంట్స్ కోసం బమిడికలొద్దిలో లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరిపారు. కుప్పంలో జరిగే మైనింగ్ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. కొండల్ని అక్రమంగా తవ్వేస్తున్న వారందర్ని బోనెక్కిస్తాం. ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోంది.’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో జనజీవనం స్తభించిపోయింది. జైపూర్ మండలం టేకుమట్ల – శెట్పల్లి గ్రామాల మధ్యలో రసూల్‌పల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీందో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

* కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ కేంద్రం ఇవ్వనుంది. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కరోనాపై పోరాటంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

* తెలంగాణలో వానలు, వరదలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం సమీక్ష
నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆయన.
ఈ సందర్భంగా.. వరద పరిస్థితులపై మంత్రులతో ఫోన్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడినట్లు సమాచారం.
ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని, బయటకు రావొద్దని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. అలాగే ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారాయన.దేవాదుల ప్రాజెక్టు ముంపుపై తక్షణం చర్యలు తీసుకోవాలని, సహాయక చర్యల కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గత నాలుగైదు రోజులుగా మబ్బులకు చిల్లులు పడినట్లు వాన కురుస్తూనే ఉంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌.. వానల ఉదృతి రిత్యా శనివారం వరకు సెలవులను పొడిగించింది.

* టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్‌ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం మంది, ఎంబైపీసీ విభాగంలో 75.81 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in, https://polycetts.nic.in, www.sbtet.telangana.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు. కాగా, పాలిటెక్‌ ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని నవీన్‌ మిట్టల్ ప్రకటించారు.

* ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం వేల సంవత్సరాల కిందటే ఆర్ష గ్రంథాలు, పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తుందని టీటీడీ ఈవో, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎవి ధర్మారెడ్డి వెల్లడించారు. ఉత్తరాయణం, దక్షిణాయనం లాంటి లెక్కలు ఈ కోవలోకే వస్తాయని ఆయన పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన నవగ్రహ మఖ శ్రీ సుదర్శన పారమాత్మక యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

* ఏపీలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 15.10 అడుగులకు చేరగా ముందు జాగ్రత్తగా అధికారులు 15 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో వరద నీటి ప్రవాహంతో కొన్ని మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

* ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. భారీగా వరద వస్తుండటంతో ఉదయం 7 గంటలకు 51.20 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టిన గోదావరితో వరద మళ్లీ పెరిగింది. ప్రస్తుతం 13,31,102 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది.

* పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాశయ సందర్శన కోసం ప్రజలను అనుమతించడంలేదని తహసీల్దార్‌ రంగా ప్రసాద్‌, రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటి మట్టం 407 అడుగులు కాగా 400.80 అడుగుల వద్ద నిలకడగా ఉంది. రిజర్వాయర్‌ పూర్తి సామర్ధ్యం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.675 టీఎంసీలకు చేరింది. ఇన్‌ప్లో-23వేల క్యూసెక్కులుకాగా అవుట్‌ప్లో 27వేల క్యూసెక్కులు ఉంది. ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

*కామారెడ్డి అంగడి మార్కెట్‌లో నకిలీ 500 రూపాయల నోట్లు కలకలం రేపాయి. ఓ వ్యక్తి ఓ షాపులో రూ.500 నోట్‌తో వస్తువులు కొనుగోలు చేశాడు. కొద్ది సేపటికి తిరిగి మరో నోటుతో వస్తువులను కొనుగోలు చేశాడు. అనుమానంతో ఆరా తీసిన వ్యాపారి, నోటు నకిలీగా గుర్తించి, స్థానికుల సహాయంతో పోలీసులకు అప్పగించాడు. నకిలీ నోట్లు కలిగి ఉన్న వ్యక్తి గాంధారి మండలం చిన్న పోతంగల్ గ్రామానికి చెందిన సంజీవులుగా గుర్తించారు. ప్రస్తుతం సంజీవులు పోలీసుల అదుపులో ఉన్నాడు.

*సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో సీఎం కేసీఆర్‌(CM KCR)పై భజరంగ్ దళ్ నేతలు ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ లో ఉన్న ప్రముఖ దేవతలను కీర్తించారని, దీనిని రాజకీయంగా తప్పు పడుతూ జులై 10వ తేదీన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యానించారని వీహెచ్‌పీ(VHP) పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ నాయకుడు అభిషేక్ డిమాండ్ చేశారు.

*నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ కు భారీగా వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్‌లోకి 9420 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1395.59 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 7.284 టీఎంసీలుగా కొనసాగుతోంది.

*భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. 50.80 అడుగుల నుంచి 50.90 అడుగులకు వరద పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టిన గోదావరి నేడు కాస్త వరద పెరిగింది. అంతకుముందు 53.9 అడుగుల నుంచి 50.80 అడుగులకు గోదావరి వరద తగ్గింది. ఎగువన సమ్మక్క బ్యారేజ్ నుంచి వరద ఉధృతితో స్వల్పంగా గోదావరి వరద పెరుగుతుంది. భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

* రాయలసీమ జిల్లాల జీవనాడి తుంగభద్ర (Tungabhadra) జలాశయానికి వరద కొనసాగుతోంది. డ్యాం (Dam) ఎగువ కర్ణాటక 9Karnataka)లోని మల్నాడు ప్రాంతమైన సీమొగ్గ, ఆరావళి పర్వతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయం ఉప్పొంగుతోంది. వరదప్రవాహం అధికం కావడంతో అధికారులు జలాశయం 20 గేట్లు ఎత్తివేసి 39,243 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో: 90,664 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో: 39,243 క్యూసెక్కులుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 1631.48 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం నీటి నిల్వ 99 టీఎంసీలు ఉంది. నది తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోర్డు ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డి సూచించారు.

*గోపాలపురంలో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫోటోల వివాదంపై ఛలో రావులపాలెం పోలీస్ స్టేషన్‌ల ముట్టడికి మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో హర్షకుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రావులపాలెం, గోపాలపురంలో పోలీసులు భారీగా మోహరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 600 మంది దళిత నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

*పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. స్పిల్వే వద్ద 34.3 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అప్రమత్తమైన అధికారులు 48 గేట్లను ఎత్తి దిగువకు 12.84 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. వరద నీటి ప్రవాహంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. పోలీస్ చెక్ పోస్టును వరద నీరు చుట్టుముట్టింది. ప్రాజెక్టు ప్రధాన రహదారిపై వరద నీటిమట్టం 14 అడుగుల చేరడంతో ప్రాజెక్టులోకి రాకపోకలు నిలిపివేశారు.

*కోర్టు విచారణకు గైర్హాజరైన ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణపై హైకోర్టు కన్నెర్రజేసింది. ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీచేస్తూ తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్‌ మంగళవారం ఆదేశాలిచ్చారు. పాఠశాలలకు పుస్తకాలు, ట్యాబ్‌లు, బయోమెట్రిక్‌ పరికరాల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం రూ.21.19కోట్లు చెల్లించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ హైకోర్టును ఆశ్రయించింది.

*మద్యం ఆదాయ కుంభకోణంపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నామని టీడీపీ(TDP) నేత డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… 30 శాతం జెటాక్స్ రూపేణా జగన్ జేబుల్లోకి అక్రమ మద్యం ఆదాయం వెళ్తోంది కాబట్టే డిజిటల్ లావాదేవీలు పెట్టలేదని విమర్శించారు. మద్యంలో విషపూరిత రసాయనాలు ఉన్నాయని తాము నివేదికలు విడుదల చేస్తే ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు. అవసరం అయితే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ సర్కారు వచ్చిన తరువాతే రాష్ట్రంలో 106 మద్యం బ్రాండ్స్ వచ్చాయని డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు.

*తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ (AP)లోని మున్సిపల్ కార్మికులు మూడో రోజు బుధవారం సమ్మె కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో కార్మకులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ఈ రోజు విశాఖలోని వేపగుంట డంపింగ్ యార్డ్ ముందు సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు నేత వెంకట రెడ్డి మాట్లాడుతూ.. పారిశుద్ధ కార్మికులు మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్మికులకు జీతాలు పెంచకుండా… తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘోరం ఎక్కడైనా ఉందా? అన్నారు. ఈ నెల 14 నుంచి వాటర్ సప్లై కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాడుతామని వెంకట రెడ్డి స్పష్టం చేశారు.

* సబ్బవరం అసకపల్లి గ్రామంలో పెద్దపులి కలకలం రేపుతోంది. సబ్బవరం మండలం అసకపల్లి గ్రామంలో ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అసకపల్లి గ్రామ శివారులో ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. అసకపల్లి నుంచి పెద్ద గొల్లల పాలెం నరవ మీదగా సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో దండోరా వేయిస్తూ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

* సబ్బవరం అసకపల్లి గ్రామంలో పెద్దపులి కలకలం రేపుతోంది. సబ్బవరం మండలం అసకపల్లి గ్రామంలో ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అసకపల్లి గ్రామ శివారులో ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. అసకపల్లి నుంచి పెద్ద గొల్లల పాలెం నరవ మీదగా సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో దండోరా వేయిస్తూ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

*తెనాలిలో ‘జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు’ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైద్యశాల ఎదుట మోకాళ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మినిమం టైం స్కేల్ అమలుచేయాలని కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కాంట్రాక్ట్ సిబ్బంది హెచ్చరించారు. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

*అమలాపురంలో మున్సిపల్‌ కార్మికులపై కమిషనర్ చిందులు తొక్కారు. పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్‌ కమిషనర్ బెదిరింపులకు పాల్పడినట్లు కార్మికులు వాపోతున్నారు. తమాషాలు చేస్తున్నారా అంటూ కార్మికులపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెప్పినట్లు పడి ఉండాలంటూ కార్మికులకు కమిషనర్‌ హుకుం కూడా జారీ చేసినట్లు తెలిసింది. కమిషనర్‌ తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. బెదరింపులకు పాల్పడుతున్న కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

*ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి.. చెరువులు కట్టలు తెగుతున్నాయి.. ఏజెన్సీల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

*వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒరిస్సాను తీవ్ర అల్పపీడనం కొనసాగుతుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

*వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ఆదేశించారు. ఆగస్ట్ 1 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విలేజ్ క్లినిక్స్‌, పీహెచ్‌సీలకు డిజిటల్ వీడియో ప్రక్రియను అనుసంధానించాలని పేర్కొన్నారు. కొవిడ్ ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి ఆదేశించారు. అయితే సమావేశంలో ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపు గురించిన ప్రస్తావన రాలేదు.

* రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము పై కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ పరుష వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యావత్తు గిరిజన సమాజానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ద్రౌపది క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగారని, అజోయ్ కుమార్ వ్యాఖ్యలు ఆమెకు, ఆదివాసీ సమాజానికి తీవ్ర అవమానకరమని పేర్కొంది.

* గేట్‌వే హోటల్‌లో చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసిన సోమువీర్రాజు, సీఎం రమేశ్‌, జీవీఎల్, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్‌ కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థికి ముర్ముకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు నేతలు తెలిపారు. చంద్రబాబుతో జీవీఎల్, సోమువీర్రాజులు మాటామంతి కలిపారు. బాగా బరువు తగ్గారని చంద్రబాబుతో జీవీఎల్ అనగా, గతంలో 70 కిలోలకు పైగా ఉండేవాడిని, ఇప్పుడు 60 కిలోలకు పైబడి ఉన్నానని నవ్వుకుంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు.

* సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారంపై రేవంత్‌ లేఖ రాశారు. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేయించాలన్నారు. అలాగే ఎకరాకు రూ.15 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్నారు. తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి, పంట బీమా అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

* భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. 50.80 అడుగుల నుంచి 50.90 అడుగులకు వరద పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టిన గోదావరి నేడు కాస్త వరద పెరిగింది. అంతకుముందు 53.9 అడుగుల నుంచి 50.80 అడుగులకు గోదావరి వరద తగ్గింది. ఎగువన సమ్మక్క బ్యారేజ్ నుంచి వరద ఉధృతితో స్వల్పంగా గోదావరి వరద పెరుగుతుంది. భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

* రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తడంతో ప్రాజెక్టులు
నిండుకుండలామారుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు(Ellampalli project)లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 43 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో 8.50 లక్షలుగా ఉండగా, ఔట్‌ఫ్లో 8.50 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.7168 టీఎంసీలుగా కొనసాగుతుంది.

*వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 92 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. 21 రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు, ఇతర ఆభరణాలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 92 లక్షల 3 వేల 894 రూపాయల నగదు, 238 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 18 కిలోల 250 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి పర ్యవేక్షణలో ఏఈవోలు బి.శ్రీనివాస్‌, జయకుమారి, ప్రతాప నవీన్‌, సూపరింటెండెంట్లు సిరిగిరి శ్రీరాములు, గోలి శ్రీనివాస్‌, హరిహరనాథ్‌, పూజిత, తిరుపతిరావు, నటరాజు, లక్ష్మణరావు, వరి నర్సయ్య, గుండి నర్సింహమూర్తి, వెల్ది సంతోష్‌, అరుణ్‌కుమార్‌, అకౌంట్స్‌ అడ్వైజర్‌ ఆగమరావు, పీఆర్‌వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

*సీఎం కేసీఆర్‌ మనుమడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌లు హిమాన్షుకు పెద్దమ్మ తల్లి చిత్ర పటాన్ని బహుకరించారు. కాగా, ప్రగతిభవన్‌లో తన బాబాయి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతో్‌షతో కలిసి హిమాన్షు మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హిమాన్షుతో సంతోష్‌ దగ్గరుండి మొక్కలు నాటించారు.

* ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 10వ తేదీన నిర్వహించిన విలేకరుల సమావేశంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బజరంగ్‌దళ్‌ నాయకులు మంగళవారం మంగళ్‌హాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రాచలం, జోగులాంబా ఈ అంబా ఆ అంబ అని పేరు చెప్పి దండం పెట్టిపోయిండంటూ కేసీఆర్‌ హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించి న్యాయ సలహా కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు.

* రజాకార్ల నేపథ్యంలో ఎలాంటి చిత్ర రచననూ చేపట్టవద్దంటూ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన సదుద్దేశంతో చిత్ర నిర్మాణం చేపట్టినా బీజేపీ, మజ్లిస్‌ వంటి పార్టీలు దాని ఆధారంగా ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని చిత్ర నిర్మాణం జరగకుండా నిషేధించాలన్నారు.

*జేఈఈ మెయున్స్‌లో తమ సంస్థ రికార్డు ఫలితాలను సాధించిందని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 100 పర్సెంటైల్‌ సాధించిన వారిలో ఐదుగురు తమ విద్యార్థులేనని ఆమె ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో 300కు 300 మార్కులను సాధించడంతో పాటు 100 పర్సెంటెల్‌ సాధించిన ఒకే ఒక్క విద్యార్థి పెనికెలపాటి రవికిషోర్‌ తమ విద్యార్థి కావడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే బాలికల విభాగంలో టాప్‌ స్కోర్‌ సాధించిన 10 మందిలో ఐదుగురు 99.99 పర్సెంటైల్‌తో శ్రీచైతన్య విద్యార్థులున్నారని చెప్పారు. ఇంతటి ఫలితాలను సాధించడానికి తమ ప్రోగ్రామ్‌లు, ఫ్యాకల్టీ, మైక్రో షెడ్యూల్స్‌, టెస్టింగ్‌ విధానమేనని గుర్తు చేశారు.

*టీడీపీ పార్టీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటె స్వామిదా్‌స (అనంతపురం), ప్రధాన కార్యదర్శిగా డీవీ కుమార్‌ బోస్‌(పలాస) నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు వీరిని నియమించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

*పోలీసుల కారణంగా మృతి చెందిన ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 14న చలో నెల్లూరుకు బహుజనులంతా కదలిరావాలని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకాలకు నారాయణ హత్య పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. దళితుడిని కొట్టి చంపేసిన పోలీసులపై చర్యలు తీసుకుని, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తన నిజాయితీ నిరూపించుకోవాలని పేర్కొన్నారు.

*పోలవరం కాఫర్‌ డ్యామ్‌కు వరద తాకిడి తీవ్రంగా ఉంది. పోలవరం ఎగువ కాఫర్‌డ్యామ్‌, స్పిల్‌వేకు ఎగువన 34.155 మీటర్లు నీటి మట్టం నమోదైంది. పోలవరంలో 24.677 మీటర్లు ఉంది. ఎగువ నుంచి వస్తున్న 12,24,174 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రాంతాల్లో కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు పర్యటించారు. గోదావరి నీటిమట్టం పెరుగుతుండడంతో మంగళవారం ఉదయానికి పోలవరం నుంచి ప్రాజెక్టుకి వెళ్లే మార్గంలో కడమ్మ వంతెనపై అడుగు ఎత్తున వరద జలాలు ప్రవహించాయి. పోలవరం నుంచి ప్రాజెక్టుకి చేరుకునే మార్గం నీటితో నిండిపోయినా.. కార్మికులు, అధికారులు నీటిలోనే ప్రాజెక్టుకి చేరుకున్నారు. సాయంత్రం త్వరితగతిన ప్రాజెక్టు నుంచి ఇంటిముఖం పట్టారు. ఆతర్వాత నీటి మట్టం పెరగడంతో ప్రాజెక్టుకు రాకపోకలు నిలిపివేశారు.

*కృష్ణా తీరంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. రోడ్ల వెంట చెట్లు విరిగిపడితే, వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లంక గ్రామాల్లో అరటి, తమలపాకు, బొప్పాయి, చెరకు తోటలు పడిపోయాయి. రోడ్ల వెంట చెట్లు, కొమ్మలు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. చాలాచోట్ల విద్యుత్తు తీగలు తెగిపోయాయి. దీంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. మంగళవారం ఉదయం నుంచే ఒకమదిరి గాలులు వీస్తే, సాయంత్రానికి గాలుల తీవ్రత పెరిగిపోయింది. అల్పపీడనం ప్రభావంతో గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. మంగళవారం వర్షానికి తోడు గాలులు మొదలయ్యాయి. గాలుల తీవ్రత అర్ధరాత్రి వరకు కొనసాగటంతో ఇబ్బందులు తప్పలేదు. పలుచోట్ల పూరిళ్ల కప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్తు స్థంబాలు విరిగిపడిన ప్రాంతాలకు మాత్రం పునరుద్దరణ బుధవారమే సాధ్యమవుతుందని విద్యుత్తు శాఖ అఽధికారులు చెబుతున్నారు.

*టీడీపీ పార్టీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటె స్వామిదా్‌స (అనంతపురం), ప్రధాన కార్యదర్శిగా డీవీ కుమార్‌ బోస్‌(పలాస) నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు వీరిని నియమించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

*శాసనసభ పీఏసీ ఛైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ భద్రతపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం ఆయన గన్‌మ్యాన్‌ లేకుండానే ఇక్కడకు వచ్చారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన పార్టీ సమావేశానికి, ఆ తర్వాత విజయవాడ గేట్‌వే హోటల్‌లో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ము ర్ముతో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆయన వద్ద ఉ న్న గన్‌మ్యాన్‌ను పోలీస్‌ శాఖ వెనక్కు తీసుకోవడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో గన్‌మ్యాన్‌ను ఆయన వద్ద కు పంపారు. నిబంధనల ప్రకారం పైస్థాయి అధికారి వచ్చి గన్‌మ్యాన్‌ను పరిచయం చేయాలని, ఎవరో వచ్చి తానే గన్‌మ్యాన్‌ అంటే చేర్చుకోలేనని కేశవ్‌ స్పష్టం చేశారు. ‘వచ్చిన గన్‌మ్యాన్‌ ఏమయ్యాడో నాకు తెలియదు. తర్వాత ఎవరూ రాలేదు. గన్‌మ్యాన్‌ లేకుండానే తిరుగుతున్నాను. రెండు రోజుల్లో కొన్ని సంచలన విషయాలు బయట పెట్టబోతున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు.

*గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందుపట్లలోని రాణి రుద్రమదేవి కాంస్య విగ్రహం, శిలా శాసనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శిలా మరణ శాసనం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. రుద్రమ దేవి చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని, ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో స్మారక కేంద్రం నిర్మించి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

*నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల రెగ్యులరైజేషన్‌ విషయంలో జీవో నెంబర్‌ 152తో సంబంధంలేని పిటిషన్‌లపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు సుముఖత వ్యక్తంచేసింది. 2015లో ఆ జీవో జారీ కాగా, అంతకు ముందు నిర్మించిన తమ భవనాలను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ పలువురు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని ప్రభుత్వం తిరస్కరించ డంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి పిటిషన్‌లు 20 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం జీవో 152 అంశం సుప్రీంకోర్టులో ఉండడంతో దాంట్లో తాము జోక్యం చేసుకోబోమని చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం మంగళవారం పేర్కొంది. ఈ జీవోతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్‌లపై విచారణ చేపడుతామని తెలిపింది. వీటి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

*తెలంగాణ ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల అప్పును సేకరించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా అప్పును తీసుకుంది. 12ఏళ్ల కాల పరిమితి, 7.89 శాతం వార్షిక వడ్డీతో ఈ రుణాన్ని సేకరించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రూ.2,000 కోట్లు, హరియాణా రూ.2,000 కోట్లు, తమిళనాడు రూ.2,000 కోట్లు, పంజాబ్‌ రూ.600 కోట్లు, మేఘాలయ రూ.200 కోట్లు, పాండిచ్చేరి రూ.200 కోట్లు అప్పు తీసుకున్నాయి. ఈ రూ.1,000 కోట్లతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్‌బీఐ ద్వారా రూ.11 వేల కోట్ల రుణాన్ని సేకరించింది. జూన్‌ 7న రూ.4,000 కోట్లు, జూన్‌ 28న రూ.3,000 కోట్లు, ఈ నెల 5న రూ.3,000 కోట్లు రుణం తీసుకుంది.

* కరోనా వైరస్‌ బారిన పడి మంగళవారం ఓ మహిళ మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన 48 ఏళ్ల మహిళ వారం క్రితం జ్వరం బారిన పడడంతో కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పరీక్షలు చేయగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీనికి తోడు ఆమెకు ఆస్తమా ఉండడంతో పరిస్థితి విషమించగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. అయితే, ఈ మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న కరోనాతో ఒకరు చనిపోయారు. అధికారికంగా అదే చివరి మరణం కాగా, అప్పటి వరకు మరణాల సంఖ్య 4,111గా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 27,249 టెస్టులు చేయగా, 562 పాజిటివ్‌లు వచ్చాయి. నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 329, మేడ్చల్‌లో 52, రంగారెడ్డిలో 60, ఖమ్మంలో 14, సంగారెడ్డిలో 13, పెద్దపల్లి, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో పదేసి చొప్పున ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 5,112 యాక్టివ్‌ కేసులున్నాయి. మంగళవారం 12,804 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇక రాష్ట్ర కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్టోర్‌ వద్ద 24.22 లక్షల డోసులు నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 89 మంది కొవిడ్‌ రోగులున్నారు.

* రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ను వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల పోస్టులనూ భర్తీ చేయాలన్నారు. ఊరికి పది బెల్టు షాపులను పెట్టడం తెలిసిన సీఎం కేసీఆర్‌కు కనీసం వంద మంది విద్యార్థులకు ఒక టీచర్‌నైనా పెట్టడం తెలియదా? అని మంగళవారం ట్వీట్‌ చేశారు.

*ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము మద్దతిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా 42 పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దత్తు ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. అబ్దుల్‌కలామ్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకోవడంలో చంద్రబాబుది కీలక పాత్ర ఉందని గుర్తుచేశారు. తెలుగురాష్ట్రాల్లో సామాజిక బాధ్యత గల వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబుకు ఎన్డీఏ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

* సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సఐఐ) ఉత్పత్తి చేస్తున్న గర్భాశయ కేన్సర్‌ టీకా క్యూహెచ్‌పీవీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) మంగళవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ టీకాకు డీసీజీఐ నిపుణుల కమిటీ(ఎ్‌సఈసీ), ప్రభుత్వ సలహాదారు ప్యానెల్‌ ఎన్‌టీఏజీఐ పచ్చజెండా ఊపాయి.

* తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద శ్రీవారి భక్తులకు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. జాతీయరహదారిపై కారు దగ్ధమైన ఘటన నుంచి ఆరుగురు భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల నుంచి వేలూరు వెళ్తుండగా కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చూసిన భక్తులు వెంటనే కారు నుంచి దిగి తమ ప్రాణాలను రక్షించుకున్నారు.

* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయ పరిసరాల్లో ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. వీరికి దర్శనం 10 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి . నిన్న 74,212 మంది భక్తులు స్వామివారి దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.5.05 కోట్లు వచ్చిందని తెలిపారు.తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి తో వైభవంగా ముగిశాయి.

* భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో విద్యాసంస్థ‌ల‌కు మ‌రో మూడు రోజుల పాటు సెలవులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప‌లు యూనివ‌ర్సిటీల ప‌రిధిల్లో రేప‌ట్నుంచి శ‌నివారం వ‌ర‌కు జ‌రిగే ప‌లు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు.గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గాల్సిన అన్ని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన‌ట్లు ఉస్మానియా యూనివ‌ర్సిటీ అధికారులు వెల్ల‌డించారు. వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను త‌ర్వాత‌ ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొన్నారు.అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి. గురు, శుక్ర‌వారాల్లో జ‌రగాల్సిన పీజీ రెండో సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు. వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల తేదీల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని యూనివ‌ర్సిటీ అధికారులు తెలిపారు.