Health

జొన్నరొట్టె తింటున్నారా?

జొన్నరొట్టె తింటున్నారా?

వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు, ఫ్రెంచ్‌ఫ్రైస్‌, సమోసాలు తినాలనిపిస్తుంది కాని.. అవన్నీ డీప్‌ఫ్రైతో తయారయ్యేవి. వాటికి బదులు అప్పుడప్పుడు జొన్నరొట్టెలు తింటే.. ఆహా ఆ రుచే వేరు. అందులోనూ జొన్నలు ఎంతబలవర్ధకమైన ఆహారమంటే…
*జొన్నల వాడకం ఈ నాటిది కాదు. చాలామందికి తెలియదు కాని క్రీ.పూ 3 వేల ఏళ్ల కిందటి నుంచి మనుషులకు జొన్న ప్రధాన ఆహారం.
* బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నలోనే అధిక కాల్షియం ఉంటుంది. అంతేకాదు, ఇనుము, ప్రొటీన్లు, పీచుపదార్థం వంటి పోషకాలు కూడా ఉంటాయి.
* పలు దేశాల్లో చేపట్టిన వైద్య పరిశోధనల్లో తేలిన విషయం గుండె జబ్బుల్ని అడ్డుకునే శక్తి జొన్నకు ఉంది.
* ప్రతి ఒక్కరి ఆరోగ్యానికీ యాంటీ ఆక్సిడెంట్స్‌ అనేవి కీలకం. జొన్నలో ఇవి పుష్కలం. ఇందులో మనకు మేలుచేసే పోలీఫెనిక్‌ కాంపౌడ్స్‌ అధికం.
* తరచూ జొన్నతో చేసిన పదార్థాలను తినడం వల్ల కొవ్వు సమస్య రాదు. చెడుకొవ్వును కూడా తగ్గించే గుణం ఈ గింజలకు ఉంటుంది.
* ఎముకలు బలిష్టంగా ఉండేందుకు పాస్పరస్‌ చాలా అవసరం. ఒక కప్పు జొన్నల్లో 550 మిల్లీగ్రాముల పాస్పరస్‌ లభిస్తుంది.
* జొన్నరొట్టెలు ఎన్ని తింటే అంత మంచిది. జొన్నల్లో నరాల బలహీనతను తగ్గించే గుణం ఉంటుంది. మరీ ముఖ్యంగా విటమిన్‌ బి ఫ్యామిలీకి సంబంధించిన విటమిన్లు చాలా దొరుకుతాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
* వయసు పెరిగేకొద్దీ మతిమరుపు, కంటిచూపు మందగించడం సహజం. ఈ రెండు సమస్యలు తొందరగా రాకూడదంటే జొన్నలు ఎక్కువగా వాడాలి.
* జొన్నల్లో పిండి పదార్థం అధికం. జీర్ణశక్తిని పెంపొందించి అందుకు అవసరమైన హార్మోన్లను వృద్ది చేస్తాయి.