NRI-NRT

గ్రీన్‌కార్డుల కోసం ఎదురుతెన్నులే!

గ్రీన్‌కార్డుల కోసం ఎదురుతెన్నులే!

అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం భారతీయులు మరికొంత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 3,69,322 ఎంప్లాయ్‌మెంట్‌ వీసా పిటిషన్లకు ఆమోదం పొందిన వారు గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా ఈబీ2, ఈబీ3 (వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన వర్కర్లు) కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్నారు. వలస కార్మికులకు వీసాలు స్పాన్సర్‌ చేసేందుకు టెక్నాలజీ కంపెనీలు వీటిని వినియోగించుకుంటాయి. ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డును పొందడానికి మొద టి అడుగైన ఫామ్‌ ఐ-140 అప్రూవల్‌ను ఈ దరఖాస్తుదారులు పొందారు. ఐ-140 అప్రూవల్‌ తర్వాత గ్రీన్‌కార్డుల కోసం భారతీయులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. యూ ఎస్‌ సిటిజన్‌షి్‌ప అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎ్‌ససీఐఎస్‌) ప్రాసెసింగ్‌లో జాప్యమే దీనికి కారణమని ఇమ్మిగ్రేషన్‌ డాట్‌ కామ్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ రాజీ వ్‌ ఎస్‌ ఖన్నా చెబుతున్నారు. యూ ఎ్‌ససీఐఎస్‌ వివరాల ప్రకారం.. 2022 సంవత్సరం మొదటి రెం డు త్రైమాసికాల్లో భారతీయులు అధిక సంఖ్యలో ఐ-140 పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు నెలల్లో ఏజెన్సీకి 37,719 దరఖాస్తులు వచ్చాయి. ఇదేకాలంలో 25,274 ఐ-140 దరఖాస్తులకు ఆమోదం లభించింది.