Movies

మైండ్‌కి సంబంధించినది!

మైండ్‌కి సంబంధించినది!

‘హార్ట్‌ అటాక్‌, క్షణం, కల్కి’ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ఆదా శర్మ. ఈ బ్యూటీ మల్టీటాలెంటెడ్‌. మంచి డ్యాన్సర్‌, జిమ్నాస్ట్‌, షూటర్‌. ఫిట్‌నె్‌సతో పాటు ఆదా చేసే రొటీన్‌ వర్కవుట్స్‌, పాటించే డైట్‌ ఇవే..

‘‘బాలీవుడ్‌లో 1920 చిత్రంతో లాంచ్‌ అవ్వటం నా అదృష్టం. అలాగే దక్షిణాది సినిమాలతో ప్రేక్షకుల ఆదరణ దక్కింది. దక్షిణాది చిత్రాలు హిందీలో డబ్‌ అవ్వటంతో గుర్తింపు వచ్చింది. వాస్తవానికి నేను సినిమా నేపథ్యం నుంచి రాలేదు. అయితే స్కూల్‌ డేస్‌ నుంచే పరిస్థితులను అర్థం చేసుకొని, ఆ సందర్భానికి తగినట్టు నడుచుకోవడం అలవాటు. మా క్లాస్‌లో నేను తెలివైన విద్యార్థిని. కాలేజీ రోజుల్లో మిమిక్రీ చేసేదాన్ని. చొచ్చుకుని పోయే మనస్తత్వం వల్ల సినిమాల్లో నిలదొక్కుకున్నానేమో! అది నా స్వభావం..దేవుడు నాకిచ్చిన అందం, చర్మసౌందర్యం ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలకు మేక్‌పతో పోజులివ్వను. నా హెయిర్‌ కూడా అంతే. అలా నేచురల్‌గా ఉండటం ఇష్టం. ఇకపోతే నేను కథక్‌ డ్యాన్సర్‌ను. అందులో గ్రాడ్యుయేషన్‌ చేశా. ఏ స్టెప్‌ అయినా అలవోకగా వేస్తా. తొలి తమిళ సినిమాలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్‌ వేసే అవకాశం దక్కడం అదృష్టం. ఆ సమయంలో రోజూ డ్యాన్స్‌ సాధన చేసేదాన్ని. వార్మప్‌ కోసం సూర్య నమస్కారం, కూల్‌ అవ్వటానికి చంద్ర నమస్కారం చేసేదాన్ని. జిమ్నాస్టిక్స్‌ చేస్తా కాబట్టి యాక్షన్‌, స్టంట్స్‌ సులువు. కర్ర తిప్పటంలో నా స్టయిలే వేరు.

వర్కవుట్స్‌ అంటే పిచ్చి.. వర్కవుట్స్‌ చేయనిదే నిద్రరాదు. డైలీ వర్కవుట్స్‌ చేయకపోతే ఏమీ తోచదు. అందుకే పిచ్చిపట్టినట్లే వర్కవుట్స్‌ చేస్తా. నేను కోడిగుడ్లు కూడా తినను. పూర్తి శాకాహారిని. నా శరీరం ఫ్లెక్సిబిలిటీ విషయంలో పర్ఫెక్ట్‌. ఇన్‌స్టాతో పాటు సోషల్‌ మీడియాలో వర్కవుట్స్‌తో పాటు అవేర్‌నెస్‌ తీసుకొస్తా. స్టంట్స్‌ చేస్తా. డ్యాన్స్‌ వీడియోలతో ఇన్‌స్పైర్‌ చేస్తా. ముఖ్యంగా ఎవరికైనా ఫిట్‌నెస్‌ ఉండాలని చెబుతా. కొందరు సిక్స్‌ లేదా ఎయిట్‌ ప్యాక్‌ బాడీలను బిల్డప్‌ చేస్తారు. దానికంటే ముందు బలమైన శారీరక ధారుడ్యం, ఫ్లెక్సిబిలిటీ మీద దృష్టి పెడితే బావుంటుంది కదా అనిపిస్తుంది. వాస్తవానికి ఫిట్‌నెస్‌ మైండ్‌కి సంబంధించినది. మెంటల్‌గా ఫిట్‌ అయితేనే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సులువు. మెడిటేషన్‌, డ్యాన్స్‌, వర్కవుట్స్‌ నా జీవితంలో భాగం. గుడ్డిగా మీరు ఫలానా తినండి.. ఇలా చేయండి అని ఎవరికీ సలహా ఇవ్వను. నేనైతే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినను. తాజా కూరగాయలు, పండ్లు తింటా.