Movies

ఎర్రతివాచిపై నడవాలనీ

ఎర్రతివాచిపై నడవాలనీ

నటీనటులకు ‘ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ గొప్పదనం గురించి తెలిసిందే . ఆ వేడుకల్లో పాల్గొంటే .. అరుదైన అవార్డు సాధించినట్లుగా అనిపిస్తుంది . పత్రికల్లో , టీవీల్లో ఐశ్వర్యారాయ్ బచ్చన్ , దీపికా పదుకొణె లాంటివాళ్లు అక్కడికి వెళ్లిన ఫొటోలను చూసినప్పుడు … కనీసం ఒక్కసారైనా నాకా అవకాశం వస్తే బాగుండనీ , అలా వస్తే .. నాకన్నా లక్కీ మరొకరు ఉండరనీ అనుకునేదాన్ని . అలాంటిది ఈ సంవత్సరం మన భారతీయ సినిమా తరపున ‘ కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు వెళ్లా . చుట్టూ కెమెరాలు క్లిక్మంటున్నప్పుడు … ఎర్ర తివాచీపైన నడవడం ఎంత బాగుందో !