NRI-NRT

ఒహాయోలో ఆగష్టు 26 “తానా-కొల్లా అశోక్‌బాబు” దినోత్సవంగా ప్రకటన

Ohio Akron Mayor Announces August 26th As TANA-Ashok Kolla Day

తానా, తానా ఫౌండేషన్ ద్వారా గడిచిన అయిదేళ్లలో ఆక్రన్-క్యాంటన్ (ఒహాయో) ఫుడ్ బ్యాంకుకు 5లక్షల భోజనాలు అందించినందుకు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర అమెరికావ్యాప్తంగా పేద విద్యార్థులకు బ్యాగుల పంపిణీ, కోవిద్ రక్షక సామాగ్రి పంపిణీ, టీం స్క్వీర్ ద్వారా ఆపనుల్లకు సహకరించడం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ ఆక్రాన్ నగర మేయర్ డానియల్ హోరిగన్ ఆగష్టు 26వ తేదీని “తానా-కొల్లా అశోక్‌బాబు” దినోత్సవంగా ప్రకటించారు. తానాకు, తనకు ఈ గౌరవం దక్కడం పట్ల తానా కోశాధికారి హర్షం వెలిబుచ్చారు. ఆయా సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి తోడ్పడిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
Ohio Akron Mayor Announces August 26th As TANA-Ashok Kolla Day