Business

SBI ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు

SBI ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ SBI) ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లకు శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు శనివారం (అక్టోబరు 15) నుంచే అమల్లోకి వచ్చాయి. రూ.2 కోట్ల లోపు అన్ని కాలపరిమితుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 10 బేసిస్‌ పాయింట్ల నుంచి 20 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీరేట్లను పెంచింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేట్లను పెంచడం రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే. సీనియర్‌ సిటిజన్ల జమలపై కూడా 20 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ పెంచింది. తాజా పెంపుతో ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు (వివిధ కాలపరిమితులకు) 3 శాతం నుంచి 5.85శాతం వరకు ఉన్నాయి. ఇక సీనియర్‌ సిటిజన్ల జమలపై వడ్డీరేట్లు 3.5శాతం నుంచి 6.65శాతం వరకు ఉన్నాయి.