Movies

ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం

ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం

నటుడు నాగ శౌర్య త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. బెంగుళూరులో నాగ శౌర్య వివాహం అనూష శెట్టితో ఈనెల 20 న జరగబోతోంది. ఇది ప్రేమ వివాహం అని నాగ శౌర్య తండ్రి తెలియచేశారు. అనూష శెట్టి బెంగుళూరు‌లో ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్ట్ కూడా. ఆమెకి కర్ణాటక స్టేట్ టాప్ ర్యాంక్ కూడా వచ్చిందని చెబుతున్నారు. అయితే నాగ శౌర్యకి అనూష ఎలా, ఎప్పుడు పరిచయం అన్నది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. నాగ శౌర్య ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న యంగ్ నటుల్లో ఒక టాలెంటెడ్ యాక్టర్. అతని చేతిలో ఇప్ప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వున్నాయి.. బిజీగా ఉన్న యాక్టర్స్‌లో తను కూడా ఒకరు. నాగ శౌర్య వివాహం ఇలా సడెన్‌గా ఫిక్సవటం కొంచెం సర్‌ప్రైజింగ్‌గానే వుందని టాలీవుడ్‌లో అంటున్నారు. తల్లిదండ్రులకి కూడా నాలుగు రోజుల ముందు తెలిసింది అంటే.. అతని ప్రేమ వ్యవహారం ఎంత సీక్రెట్‌గా వుంచాడో అర్థం చేసుకోవచ్చు. నాగ శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ చాలా సంతోషంగా వున్నారు. తన కొడుకు ఇష్టమే తమ ఇష్టమని, చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. పెళ్లి ఈనెల 20న ఉదయం 11.25‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లికి వచ్చే వాళ్లు భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి మాత్రమే రావాలని శుభలేఖలో పేర్కొన్నారు.