NRI-NRT

కెనడాలో తాకా క్రిస్మస్ ఉత్సవాలు

TACA Christmas 2022 In Canada

తాకా(తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా) ఆధ్వర్యంలో శనివారం నాడు కెనడాలోని మిస్సిసాగ నగరంలో వున్న కెనెడియన్ కాప్టిక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.రాణి,ఆర్నాల్డ్ మద్దెలలు వేడుకలు ప్రారంభించారు. తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల అతిథులను స్వాగతించారు. శ్రీ దివ్య, రాకేష్ ప్రార్థనా గీతాలు ఆలపించారు. తాకా అధ్యక్షురాలు కల్పన మోటూరి మరియు తాకా వ్యవస్థాపక సభ్యులు చారి సామంతపూడి అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ ఉత్సవాల్లో పాల్గొన్న చిన్నారులకి క్రిస్మస్ బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమ విజయవంతానికి కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరెక్టర్లు గణేష్ తెరాల,రాణి మద్దెల, శృతి ఏలూరి, ప్రదీప్ రెడ్డి ఏలూరు, యూత్ డైరెక్టర్స్ విద్య భావనం, ఖాజిల్ మహమ్మద్ మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు తాకా వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామచంద్ర రావు దుగ్గిన, ఆర్నాల్డ్ మద్దెలలు కృషి చేశారు.