NRI-NRT

ఖమ్మంలో కుట్టుమిషన్లు పంపిణీ చేసిన తానా ఫౌండేషన్

ఖమ్మంలో కుట్టుమిషన్లు పంపిణీ చేసిన తానా ఫౌండేషన్

ఖమ్మం సత్య మార్గం సర్వీసెస్ సొసైటీ అధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి వారికి TANA తరుపున సామినేని ఫౌండేషన్ చైర్మన్ సామినేని రవి సమకూర్చిన 33 కుట్టుమిషన్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం స్థానిక వృద్దులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తానా ఫౌండేషన్ చైర్మన్ యర్లగడ్డ వెంకట రమణ పాల్గొనగా, స్థానిక కార్పొరేటర్ కర్నాటి క్రిష్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్స్ మాడురి ప్రసాద్, ఆళ్ల నిరిషా రెడ్డి, దాదే అమృతమ్మ, శ్రీలక్ష్మి, స్ధానిక సమన్వయకర్త బండి నాగేశ్వరరావు, నాయకులు మెహబూబ్ అలీ, అన్నం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.