NRI-NRT

Guntur Deaths: ఉయ్యూరు శ్రీనివాస్ విడుదల

Guntur Deaths: ఉయ్యూరు శ్రీనివాస్ విడుదల

రెండు రోజుల క్రితం గుంటూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అభాగ్యుల మరణానికి కారణమయ్యారని అరెస్టు అయిన మేరీల్యాండ్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఉయ్యూరు శ్రీనివాస్‌కు ఊరట లభించింది. శ్రీనివాస్‌ రిమాండ్‌ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్‌ చేర్చడంతో 304(2) నుంచి మినహాయింపు లభించింది. అనంతరం రూ.25 వేల స్వయం పూచీకత్తుపై శ్రీనివాస్‌ విడుదలయ్యారు. పోలీసుల విచారణకు శ్రీనివాస్‌ సహకరించాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు.