NRI-NRT

హాంగ్‌కాంగ్‌లో వైభవంగా సంక్రాంతి వేడుకలు

హాంగ్‌కాంగ్‌లో వైభవంగా సంక్రాంతి వేడుకలు

ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఈ సంక్రాంతి వేడుక నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు ఆనందాన్ని, తృప్తినిస్తోందని తెలిపారు. దీప ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభం అయింది. హాంగ్ కాంగ్ ప్రముఖ గాయని హర్షిణి ప్రార్థనగీతం ఆలపించగా, పెద్దలు చిన్నారులకు భోగి పళ్లు పోశారు. సాంస్కృతిక బృందం నుంచి రమాదేవి, మాధురి, హర్షిణి, రాధికలు ఫిబ్రవరిలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
హాంగ్‌కాంగ్‌లో వైభవంగా సంక్రాంతి వేడుకలు - 2023 Sankranthi In HongKong