Business

నష్టాల్లో మార్కెట్ సూచీలు.. మళ్లీ 18,000 దిగువకు నిఫ్టీ

నష్టాల్లో మార్కెట్ సూచీలు.. మళ్లీ 18,000 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 285 పాయింట్ల నష్టంతో 61,033 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 74 పాయింట్లు నష్టపోయి 17,961 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.73 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, హెచయూఎల్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ,టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎస్ టెక్, విప్రో,టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచీఎఫ్సీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిల్లోనే ఉన్న నేపథ్యంలో వచ్చే ద్వైమాసిక సమీక్షలో వడ్డీరేట్ల పెంపు 0.5 శాతం వరకు ఉండొచ్చని ఫెడ్ వర్గాల నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇది అక్కడి మార్కెట్లను కలవరపెట్టింది.
అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్ సూచీలు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ మదుపర్లు వరుసగా ఐదో రోజైన గురువారమూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నిన్న వారు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.1,570.62 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు సైతం రూ.1,577.27 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

గమనించాల్సిన స్టాక్స్..

వేదాంత: ఛత్తీస్గఢ్ లో నికెల్, క్రోమియం వంటి నిల్వలు ఉన్న కెల్వార్ డబ్రీ బ్లాక్కు సంబంధించిన కాంపోజిట్ లైసెన్స్ పొందడానికి వేదాంత వేసిన బిడ్ ప్రాధాన్య
క్రమంలో ముందున్నట్లు సమాచారం.
రెయిలెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి ఐటీ నెట్వర్క్ మౌలిక వసతుల సరఫరా, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్కు సంబంధించిన రూ.27.07 కోట్లు విలువ చేసే ఆర్డర్ రెయిలెల్కు లభించింది.
ఏంజిల్వన్: కంపెనీ సీఈఓ పదవి నుంచి నారాయణ్గం గాధర్ వైదొలగారు. ప్రస్తుతానికి రోజువారీ కార్యకలాపాలను ఎండీ, చైర్మన్ దినేశ్ టక్కర్
పర్యవేక్షించనున్నారు.
ఇంజినీర్స్ ఇండియా: అస్క్రీం, మిం, డౌస్క్రీం వాల్యూ చైన్కు సంబంధించిన సాంకేతిక అధ్యయనం కోసం ఆయిల్ ఇండియాతో ఇంజినీర్స్ ఇండియా అవగాహనా ఒప్పందం కుదుర్చుకొంది.

హిందూస్థాన్ ఏరోనాటిక్స్/ భారత్ ఫోర్జ్: ఏరోస్పేస్ గ్రేడ్ స్టీల్ అలాయ్స్ అభివృద్ధి, ఉత్పత్తి కోసం హిందూస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఫోర్ట్, సార్లో అడ్వాన్స్డ్
మెటీరల్స్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.