Fashion

సెలక్షన్ స్టైల్

సెలక్షన్ స్టైల్

ఈ స్టైలికి ప్రత్యేక ఎంపికలు అవసరం లేదు. మిక్స్ అండ్ మ్యాచ్ మొదటి ప్రాధాన్యత. ఆభరణాల ఎంపికకు అసలు పోటీ అక్కర్లేదు.పూసలు, సిల్వర్, ఉడ్ జ్యువలరీ ఏదైనా సెలక్షన్ మహా ఈజీ. ఎవరికి వారు తమకంటూ ఓ స్పెషల్ లుక్ ను క్రియేట్ చేసుకునే సౌలభ్యం ఈ స్టైల్ సొంతం. అందుకే, కాలాలతో పనిలేకుండా యూత్ ని అమితంగా
ఆకట్టుకుంటున్న మోడర్న్ బోహో—చిక్ స్టైల్ ఇది.

యువతను అమితంగా ఆకట్టుకునే వాటిలో బోహేమియన్ స్టైల్ ఎప్పుడూ ముందుంటుంది. ఇది ఫ్రెంచ్ నుంచి వచ్చిన శైలిగా చెబుతుంటారు. ఇది గిరిజన జీవన శైలి కి దగ్గరగా ఉండటం, మనసులను ఉల్లాసంగా ఉంచడంతో పాటు చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంటుంది.

గతంలో పా ప్, ర్యాప్ ఈవెంట్లలో బోహో – చిక్ ఫ్యాషన్ శైలి దుస్తులను ధరించేవారు. ఇప్పుడు మోడర్న్ స్టైల్ ను అనుసరిస్తూ జీన్స్, పలాజోలతో ఇక్కత్ పైస్లీ బ్లౌజులు, బటన్ డౌన్ టాప్స్, ఖఫ్తా న్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటి మీదకు ట్రైబల్ జ్యువెలరీ లేదా ఫ్యాషన్ జ్యువెలరీ మరింత ఆధునిక హంగులతో మది దోచుకుంటున్నాయి.