Sports

చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్ ప్రపంచంలో తొలి క్రికెటర్!

చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్ ప్రపంచంలో తొలి క్రికెటర్!

ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్.. ఇప్పుడు రెండో టెస్టులోనూ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో బ్రూక్ కేవలం 109 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఇది అతడికి నాలుగో టెస్టు సెంచరీ కావడం గమానర్హం.

బ్రూక్ ప్రస్తుతం డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అతడు 169 బంతుల్లో 184 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. బ్రూక్ ఇన్నింగ్స్ లో 5 సిక్స్ లు, 24 ఫోర్లు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 100.8 సగటుతో 807 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లలో 4 సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉండడం విశేషం. ఈ క్రమంలో ఓ అరుదైన ఘతనను బ్రూక్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో తొలి తొమ్మిది ఇన్నింగ్స్ లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్ లలో అతడు 807 పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(798పరుగులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్ కాంబ్లీ రికార్డు బ్రేక్ చేశాడు . ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు నష్టపోయి 315 పరుగులు చేసింది. క్రీజులో రూట్(101),బ్రూక్ (184) పరుగులతో ఉన్నారు.