NRI-NRT

ఆస్ట్రేలియా..NATA ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు..

ఆస్ట్రేలియా..NATA ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాని పురస్కరించుకొని ఆస్ట్రేలియా క్యాపిటల్ నగరం క్యాన్బెర్రా లో నవ్యఆంధ్ర తెలుగు అసోసియేషన్ (NATA)వారు women ఇన్స్పిరేషన్ నెట్వర్క్ పేరిట మహిళా దినోత్సవాని నిర్వహించారు.


మీ జీవితానికి మీరే హీరోయిన్స్ అనే సందేశం తో.. స్ఫూర్తివంతమైన మహిళలు అనుభవాలు,విశేషాలు ను పంచుకునేలా ఈ కార్యక్రమాన్ని ప్రతి యేటా నిర్వహిస్తునట్టు నాట ప్రెసిడెంట్ సాహితి పాతూరి తెలిపారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. మహిళలు ఆత్మవిశ్వాసం తో ఉంటూ ఒక్కరికి ఒక్కరూ సహకరించుకుంటూ.. తోడ్పాటు అందించుకోవాలి అన్నారు.ఈ సందర్బంగా మహిళలు సమానత్వం, సాంకేతికత అనే అంశం పై స్థానిక deakin యూనివర్సిటీ ప్రొఫెసర్ చే ప్రెసెంటేషన్ (ప్రదర్శన )ఏర్పాటు చేసారు.



కొందరూ మహిళలు రాంప్ వాక్ చేస్తూ..పలువురు మహిళలు పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేసారు. కార్యక్రమం లో పాల్గొన్న మహిళలు కు, సహకరించిన నిర్వాహలు కు నాట ప్రతినిధులు ధన్యవాదములు తెలిపారు.