WorldWonders

అశోక వృక్షం. ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉండదు..

అశోక వృక్షం. ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉండదు..

అశోక చెట్టు
భూప్రపంచంలో ఎన్నో వేలాది చెట్లు ఉన్నా కేవలం కొన్ని చెట్లను మాత్రమే హిందువులు పూజిస్తారు. వాటిని మన పూర్వీకులు దేవతా వృక్షాలుగా భావించి పూజలు చేస్తున్నారు.

వాటిలో అశోక చెట్టు ఒకటి. మన పురాణాల్లో ఈ చెట్టు ప్రస్తావన కూడా ఉంది.

సకల శోకాలనూ దూరం చేసే అశోక వృక్షం

అశోక వృక్షం… పేరును బట్టే అర్థం అవుతుంది కదా, దీని ప్రత్యేకత. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉండదు అంటారు. ఇది ఎక్కువగా శ్రీలంకలో, భారతదేశంలో పెరుగుతుంది. ఎత్తుగా, గుబురుగా పెరుగుతూ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని మొగ్గలు, పువ్వులు, కాయలు కూడా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి.

అసలు అశోక వృక్షం పేరు చెబితే సీతాదేవి గుర్తుకు రాకమానదు. కారణం సీతమ్మవారిని రావణుడు బంధించింది అశోకవనంలోనే. అందుకే ఆ తర్వాత కాలంలో అశోకకు సీతాశోక అనే పేరు వచ్చింది.

గౌతమ బుద్ధుడు లుంబినీ వనంలో అశోకవృక్షం కిందే జన్మించాడు. మహావీరుడు వైశాలీ నగరంలో అశోకవృక్షం కిందే సన్యాసాన్ని స్వీకరించాడు. హనుమంతుడు సీతాదేవిని అశోకవృక్షం కిందనే కనుగొన్నాడు. ప్రేమదేవుడు మన్మథుడి పూలబాణాలలో అశోకపుష్పాలు కూడా ఒకటి. వరలక్ష్మీ వ్రత కలశంలో ఉంచే పంచ పల్లవాలలో అశోక వృక్ష చివుళ్లు కూడా ఒకటి.

అశోకవృక్షం కింద కూర్చుని రామాయణ పారాయణ చేస్తే శోక నివారణ జరుగుతుందంటారు. ఉగాది పచ్చడిలో పూర్వం అశోక పుష్ప లేలేత మొగ్గలను, చివుళ్లను కూడా వాడేవారని ప్రాచీన గ్రంథాలను బట్టి తెలుస్తుంది. సంతానం కోరేవారు ఒక మంచి రోజు చూసుకుని అశోకవృక్షం కింద సీతారాముల పటాన్ని ఉంచి పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం.…

అయితే ఈ వృక్షం వీలైనంత వరకు ఇంటి ఆవరణ బయట ఉండటమే మంచిది. గుమ్మం ఎదురుగ అస్సలు ఉందా కూడదు. అశోక వనము లాంటి ఉద్యాన వానములో ఉంటే మంచిది.

అశోక చెట్టు ఇంటిలో ఉంటే

👉నిజానికి అశోక అనే పదం సంస్కృత పదం. అశోక అంటే బాధలు లేకుండా దుఃఖాలను తగ్గించేదని అర్ధం. ఈ చెట్టును కొంతమంది ఇంటిలో వేసుకోకూడదని అంటారు.

అయితే కొంతమంది చెట్టును ఇంటిలో వేసుకోవటం వలన కొన్ని లాభాలు ఉన్నాయని, వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అశోక చెట్టుకు ప్రతి రోజు నీటిని పోయటం వలన మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల ఆడవారు ప్రతి రోజు అశోక చెట్టుకు నీటిని పోస్తే మంచిది. అశోక చెట్టును ఇంటికి ఉత్తరం వైపున వేస్తె ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తే ఎన్నో లాభాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రతి రోజు అశోక చెట్టుకు నీటిని పోయటం మాత్రము మానకూడదు.

పెళ్లి అయిన దంపతులు అశోక చెట్ల వేళ్ళను దిండు కింద పెట్టుకొని పడుకుంటే వారి సంసారంలో ఎటువంటి కలతలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. అశోక చెట్టు వేళ్లను శుభ్రం చేసుకొని దేవుడి గదిలో పెట్టుకుంటే ఇంటికి ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి.

అశోక చెట్టు కింద ప్రతి రోజు నెయ్యి, కర్పూరంతో దీపం వెలిగిస్తే ఇంటిలోని వారందరు సుఖ సంతోషాలతో ఉండటమే కాకుండా వారికీ అదృష్టం కూడా కలిసి వస్తుంది.

👉సేకరణ👈

శుభమస్తు