NRI-NRT

మేల్ బోర్న్ లో చారిటీ డిన్నర్. అతిథిగా నాగబాబు

మేల్ బోర్న్ లో చారిటీ డిన్నర్. అతిథిగా నాగబాబు

ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరం లో లిటిల్ హాండ్స్ ఆర్గనైజషన్ (LHO)అనే స్వచ్చంద సంస్థ వారు ‘చారిటీ డిన్నర్ ‘పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మెగా బ్రదర్, నటుడు, నిర్మాత నాగబాబు పాల్గొన్నారు.

ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలు తో పాటు ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరం లో ఫండ్ రైసింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.2600 పైగా వాలంటీర్స్ కలిగి ఉన్న ఈ సంస్థ సమాజం లో యువత కు వివిధ రకాల అంశాలు పై సామాజిక అవగాహనా కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశం అని.. ఈసారి వచ్చిన ఫండ్ తో ఆర్తి ప్రాజెక్ట్ ద్వారా గర్ల్ చైల్డ్ empowerment అనే కాన్సెప్ట్ తో పనిచేస్తునట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ని మెగా బ్రదర్ నాగబాబు సంస్థ 12 వ వార్షికోత్సవం సందర్బంగా మెలబోర్న్ లో లాంచనం గా ప్రారంభింపజేసారు.

ఈ సందర్బంగా మాట్లాడిన నాగబాబు యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు.. సమాజం పట్ల యువత బాధ్యత తో ఉంటూ, సేవకార్యక్రమాలు లలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికి LHO సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.