Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (12-03-2023 నుండి 18-03-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు 🗓

🐐 మేషం(12-03-2023 నుండి 18-03-2023)

ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితిలో ఆశించిన పురోగతి కనిపిస్తోంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. రుణ బాధ చాలావరకు తగ్గుముఖం పడుతుంది. మీ బల హీనతలను ఎవరి దగ్గరా బయట పెట్టుకోవద్దు. రహస్య శత్రువులు తయారవుతారు. ఉద్యోగంలో సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం(12-03-2023 నుండి 18-03-2023)

ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ కి కూడా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది సరైన సమయం. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు. మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. అయితే అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా ముందుకు వెళతాయి.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం(12-03-2023 నుండి 18-03-2023)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఉద్యోగంలోనూ, బంధు వర్గంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. మారటానికి చేస్తున్న ప్రయత్నాలు ఒక కొ లిక్కి వస్తాయి. ఐటీ నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం మంచిది. శ్రవణా నక్షత్రం వారు శుభవార్త వింటారు. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో బాగా బిజీ అయిపోతారు.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం(12-03-2023 నుండి 18-03-2023)

ఉద్యోగ పరంగా, ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. ఐటీ రంగంలోని వారు అందలాలు ఎక్కుతారు. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. గౌరవ సత్కారాలు చోటు చేసుకుంటాయి. అధికారులకు మీ సూచనలు సూచనలు సలహాలు సలహాలు ఉపయోగపడతాయి. కుటుంబ పరంగా కొద్దిగా మనశ్శాంతి లోపిస్తుంది. పిల్లలతో సమస్యలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాలలో సరదాగా కాలక్షేపం చేస్తారు. డబ్బు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం(12-03-2023 నుండి 18-03-2023)

ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పాత విషయాలను తలుచుకొని బాధపడటం అనవసరం అని గుర్తించండి. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. జేష్ఠ నక్షత్రం వారికి సంపాదన పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్నేహితుల సహకారంతో ఒకటి రెండు వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య(12-03-2023 నుండి 18-03-2023)

ఉద్యోగంలోనూ, వ్యాపారం లోను కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భాగస్వాములు లేదా సహచరులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐటి నిపుణులు అభివృద్ధి చెందే సూచనలున్నాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీగా ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఇరుగుపొరుగుతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వేగంగా వాహనాలను నడపటం మంచిది కాదు. ఆరోగ్యం పర్వాలేదు. స్వాతి నక్షత్రం వారు శుభవార్త వింటారు.
💃💃💃💃💃💃💃

⚖ తుల(12-03-2023 నుండి 18-03-2023)

ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మిత్రులకు సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా ఒక మెట్టు పైకి వెళ్ళే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాట చలామణి అవుతుంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది. హస్తా నక్షత్రం వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు బాగా సన్నిహితులు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరికైనా వాగ్దానం చేయడం, హామీలు ఇవ్వడం పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం(12-03-2023 నుండి 18-03-2023)

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగపరంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు బాగా ఆదరిస్తారు. వ్యాపారంలో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులు తమ రంగాల్లో ఎంతగానో రాణిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. పిల్లలు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. బంధువుల నుంచి మాట వస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు(12-03-2023 నుండి 18-03-2023)

ఒక శుభకార్యంలో బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. మీ మనసులోని ఒకటి రెండు కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. పుష్యమి నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం(12-03-2023 నుండి 18-03-2023)

ఉద్యోగ పరంగా ఆర్థికపరంగా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్య లను భూతద్దంలో చూడటం మంచిది కాదు. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వారాంతంలో కుటుంబ పరంగా ఒకటి రెండు సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి శుభవార్త అందుతుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళతారు.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం(12-03-2023 నుండి 18-03-2023)

వృత్తి జీవితం లో బాగా నైపుణ్యం సాధిస్తారు. వ్యాపారం ఆశించిన స్థాయిలో ముందుకు వెళుతుంది. ఉద్యోగులు స్థిరత్వం పొందుతారు. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరటానికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చ వద్దు. బంధుమిత్రులు మీ సలహాలను, సూచనలను పాటిస్తారు. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం(12-03-2023 నుండి 18-03-2023)

వ్యాపారపరంగా బాగా కలిసి వచ్చే కాలం ఇది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం చాలా అవసరం. డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులు తమ తమ రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. ముఖ్యంగా అశ్విని భరణి నక్షత్రాల వారు అధికార యోగం దక్కించుకుంటారు. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది. దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుంది. ఒకరిద్దరి మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
🦈🦈🦈🦈🦈🦈🦈