Politics

వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ నిఘా?

వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ నిఘా?

పట్టభద్రులు,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి,సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలాయి.ఈ ఫలితాలతో వైసీపీ హైకమాండ్ హైఅలర్ట్ కావడంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై చాలా జాగ్రత్తగా ఉంది.
ఎమ్మెల్యేల కోటా కింద మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక కావాల్సి ఉండగా ఖాళీ అయిన ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులను నిలబెట్టింది.అయితే తెలుగుదేశం తమ నేతల్లో ఒకరిని ఎన్నికల బరిలోకి దించడంతో వైసీపీ హైకమాండ్‌ రంగంలోకి దిగింది.ఎమ్మెల్యేలపై డేగ కన్ను వేయాలని ఏపీ సీఎం జగన్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.
పార్టీ నాయకత్వంపై విసిగిపోయిన ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,ఆనం రాంనారాయణరెడ్డి ఎవరికి నచ్చితే వారికే ఓటేస్తామని ప్రకటించడంతో ఇక ఓట్లు తగ్గే పరిస్థితి వైసీపీలో లేదు.వైసీపీకి ప్రతి ఓటు కీలకం,రెండు ఓట్లకు మించి తెలుగుదేశం కి చెందకుండా చూసేందుకు సీఎం జగన్ వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి,సీఎం జగన్‌కు అగ్నిపరీక్ష.మార్చి 23న పోలింగ్ జరగనుండగా,వైసీపీ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేసేలా చూస్తోంది.