Devotional

భారత్‌లో రేపట్నుంచి రంజాన్‌ ఉపవాసాలు

భారత్‌లో రేపట్నుంచి రంజాన్‌ ఉపవాసాలు

🌀పలు దేశాల్లో గురువారం నుంచే..

🍥దిల్లీ: భారత్‌లో బుధవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో రంజాన్‌ నెల ఉపవాసాలు శుక్రవారం ఉదయం నుంచి మొదలుకానున్నాయి. దిల్లీలోని బహదూర్‌షా జఫర్‌ మార్గ్‌లో జరిగిన రుయత్‌ ఏ హిలాల్‌, ఇమారత్‌ ఏ షరియా-హింద్‌ కమిటీల సమావేశంలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దేశ రాజధాని దిల్లీలో కానీ, మరే ప్రాంతంలో కానీ భారత్‌లో బుధవారం రాత్రి నెలవంక కనిపించలేదని జమియత్‌ ఉలేమా ఏ హింద్‌ ప్రకటించింది. కాగా, ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేసియాలో నెలవంక కనిపించినట్లు ప్రకటించగానే బుధవారం సాయంత్రం ప్రార్థనలు మొదలయ్యాయి. సౌదీ అరేబియాతోపాటు పలు మధ్య ప్రాచ్య దేశాల్లోనూ బుధవారం రాత్రితో రంజాన్‌ నెల మొదలైనట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ దేశాల్లో గురువారం నుంచి ఉపవాసాలు ఉంటాయి. చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరించే ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. నెలవంక కనిపించగానే ఏటా రంజాన్‌ నెల ప్రారంభమవుతుంది. ఒక్కోసారి ఇది కొన్ని దేశాల్లో ఒకరోజు వెనుకాముందుగా ఉంటుంది.