Sports

హైదరాబాదులో ఆరంభమైన ఐపీఎల్ సందడి..

హైదరాబాదులో ఆరంభమైన ఐపీఎల్ సందడి..

హైదరాబాద్‌: నగరంలో ఐపీఎల్‌ సందడి మొదలైంది. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య 3.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. రద్దీ దృష్ట్యా నాగోల్‌-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మ్యాచ్‌ నేపథ్యంలో ప్రేక్షకుల కోసం నిర్వాహకులు స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.