DailyDose

TNI. నేటి తాజా వార్తలు..

TNI. నేటి తాజా వార్తలు..

* BREAKING

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్

నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరిన వైఎస్ షర్మిల

ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పిన షర్మిల

ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని సూచించిన వైఎస్ షర్మిల

కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి – వైఎస్ షర్మిల గారు

కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కెసిఆర్ బ్రతకనివ్వడు – వైఎస్ షర్మిల

ఉమ్మడిగా పోరాటం చేసేందుకు మద్దతు తెలిపిన బండి సంజయ్

త్వరలో సమావేశం అవుదామని చెప్పిన బండి సంజయ్

నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు – బండి సంజయ్

ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడింది – రేవంత్ రెడ్డి

పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పిన రేవంత్ రెడ్డి

* డాన్స్ చేస్తూ గుండెపోటుతో బీఆర్ఎస్ నాయకుడు బండారి నరేందర్ మృతి

జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంతో నృత్యాలు చేస్తుండగా కౌన్సిలర్ బండారి రజిని భర్త బండారి నరేందర్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి

*19 kg Commercial LPG cylinder prices reduced by Rs 91.50. 19 kg commercial cylinder will cost Rs 2,028 in Delhi. No change in domestic LPG prices: Sources

*వైసీపీ లో ఓటమి భయం తో ఫ్రస్టేషన్:- పుట్టపర్తి లో దాడుల ఘటనను ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు

పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‍రెడ్డి వాహనం పై , టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది.

* విజయవాడ: వైసీపీ-బీజేపీ బంధం ఏంటో నాకు తెలియదు.. వైఎస్‌కు దగ్గరగా ఉన్న నేను.. జగన్‌కు ఎందుకు దూరమయ్యానో త్వరలో ప్రెస్‌మీట్‌ పెట్టి చెబుతా-కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ

#AndhraPradesh #YSRCP #Congress #KVP

*మాజీ మంత్రి పల్లెను పార్టీ ఆఫీసులో నిర్బంధించినా…

కార్యకర్తల సహాయంతో మేడ పై నుంచి షెడ్డు మీదకు దిగిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

అడుగడుగునా అడ్డగింత..అయినా పుట్టపర్తి పట్టణంలో సత్యమ్మ గుడి సమీపానికి చేరుకున్న పల్లె

ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి , పలు వాహనాలు ధ్వంసం

* 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ వెల్లడి

టెన్త్ విద్యార్థుల‌కు ఆర్టీసీలో ఉచిత‌ ప్రయాణం

పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు

పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్‌లు ఏర్పాటు

*పత్రికా ప్రకటన, ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 01

సంజీవని తెచ్చిన సంజీవరాయడు

ఒంటిమిట్టలోని శ్రీ ఆంజనేయస్వామివారు సంజీవరాయడుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సంజీవరాయని ఆలయ పురాణ ప్రాశస్త్యం ఇలా ఉంది.

ఒంటిమిట్ట గుడిలో సీతాలక్ష్మణులు ఇరువైపులా ఉండగా కోదండం ధరించి శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు. ఇది అరణ్యవాస కాలం నాటి దృశ్యం. అప్పటికి ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం హనుమంతునికి కాలేదు. ఆ కారణం చేతనే ఒంటిమిట్ట గుడిలో ఆంజనేయస్వామి లేడంటారు. రామాలయం అంటే భూమికి దిగిన వైకుంఠమని, రాముని బంటును కావున ఎదురుగా ఉండి సేవ చేసుకుంటానని ఆంజనేయస్వామి చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఒంటిమిట్ట గుడికి ఎదురుగా సంజీవరాయడుగా కొలువుదీరి  ఉన్నాడు. రామరావణ యుద్ధంలో వానరులు మరణించినపుడు, లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు రెండుసార్లు హిమాలయ పర్వతాలు దాటి మహేంద్రగిరికి వెళ్లి నాలుగు రకాల సంజీవని మూలికలను ఆంజనేయుడు తెచ్చినట్టు పురాణ కథనం. కావున ఇక్కడి స్వామివారికి సంజీవరాయడని పేరు వచ్చింది.

చెరువు కట్ట మీద కూడా ఆంజనేయస్వామివారు కొలువై ఉన్నారు. నీటి వల్లగానీ, వరిపొలాల్లో తిరుగుతున్నపుడు గానీ, ఈ బాటలో యాత్ర చేస్తున్నప్పుడు గానీ ప్రాణభయం కలగకుండా ఈ ఆంజనేయస్వామి కాపాడతారని భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామివారు శారీరక మానసిక రోగాలు పోగొడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు.

——————————————————————-
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.


* 24 గంటల్లో 2,994 కొత్త కేసులు.. ఐదుగురు మృతి

తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి..

| దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,994 కొత్త కేసులు బయటపడ్డాయి..

మరోవైపు దేశంలో పాజిటివ్‌ కేసులసంఖ్య 16వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 16,354 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,71,551 మంది కోలుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కేరళలో ముగ్గురు, గోవా, గుజరాత్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. దీంతో కొవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,876కి చేరుకుంది

*నేడు సిద్ధూ విడుదలయ్యే అవకాశం!

చండీగఢ్‌: కాంగ్రెస్‌ నేత నవజోత్‌సింగ్‌ సిద్ధూ పటియాలా జైలు నుంచి శనివారం విడుదలయ్యే అవకాశముంది. 1988లో జరిగిన ఘర్షణ కేసులో పడ్డ ఏడాది శిక్ష పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన విడుదల కావొచ్చని న్యాయవాది హెచ్‌పీఎస్‌ వర్మ శుక్రవారమిక్కడ తెలిపారు. సుప్రీంకోర్టు ఆయన శిక్షను ఖరారు చేసిన నేపథ్యంలో గత ఏడాది మే 20వ తేదీన లొంగిపోయారు. వెంటనే ఆయనను జైలుకు తరలించారు. అయితే సత్ప్రవర్తన కారణంగా 59 ఏళ్ల సిద్ధూ ముందుగానే విడుదల కానున్నారని ఆయన న్యాయవాది వెల్లడించారు.

*ప్లాష్…. ప్లాష్… ప్లాష్… ప్లాష్..

మంత్రుల శాఖల మార్పులో మరో శాఖ అందుకొనే లక్కీ మంత్రి ఎవరు… ?

రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల పండుగమరో సారి వచ్చేసింది. క్యాబినెట్ విస్తరణ లో భాగంగా మరొక్క సారి మంత్రి పదవులు వస్తున్నాయి…ఇందులో భాగంగా శాఖల మార్పుల్లో భాగంగా అదనపు శాఖ అందుకొనే లక్కీ మంత్రి ఎవరు…? శాఖల మార్పులలో… మరో శాఖ అందే లక్కీ మంత్రి ఎవరో… ఈనెల 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే

⚪️ హైదరాబాద్

|| హైదరాబాదులో పలుచోట్ల ఈడి సోదాలు||

◻️ ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు

◻️ దాదాపు 15 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్న ఈ డి అధికారులు

◻️ తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న చూదాలు

◻️ జూబ్లీహిల్స్ మాదాపూర్ లో ఫార్మా కంపెనీ డైరెక్టర్ ల ఇళ్ళల్లో సోదాలు

*జగిత్యాల :

ఎమ్మెల్సీ కవిత పర్యటన నేపథ్యంలో…ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గృహ నిర్భంధం

జీవన్ రెడ్డి కామెంట్స్…

రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ పాలన సాగుతోంది…

దొంగచాటుగా ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయడమేంటి ?

ఇతనాల్ పరిశ్రమ తో పరిసరాలు కలుషితమవుతాయి…

నిర్భందాలతో ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారు..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అర్థమే మారిపోతోంది…