DailyDose

TNI. నేటి నేర వార్తలు. వైకాపా నేత హత్య తదితర విశేషాలు.

TNI. నేటి నేర వార్తలు. వైకాపా నేత హత్య తదితర విశేషాలు.

* కడప జిల్లా…

వైసిపి నాయకుడు దారుణ హత్య…

కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని మూలగడ్డ వద్ద వైసీపీ నాయకున్ని అతి దారుణంగా చంపిన గుర్తుతెలియని దుండగులు…

హత్యకు గురైన వ్యక్తి కమలాపురం నగర పంచాయతీలోని 20వ వార్డు ఇంచార్జ్ శంకర్ రెడ్డి గా గుర్తింపు…

హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్న ఎస్సై చిన్న పెద్దయ్య….

హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది…

*అమర వీరుడైన నేవీ కామెండో చందక గోవింద్ కి అశ్రు నివాళులతో గరివిడి లో భారీ ర్యాలీ😭🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙏🙏🙏

*స్వస్థలానికి నేవీ ఉద్యోగి చందక గోవింద్ పార్థివ దేహం.. కాసేపట్లో అంత్యక్రియలు

విశాఖపట్నం నావికాదళంలో మెరైన్‌ కమాండోగా విధులు నిర్వర్తిస్తూ కోల్‌కతాలో పారాచూట్‌ శిక్షణలో ప్రాణాలు కోల్పోయిన చందక గోవింద్​కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. మృతదేహం గురువారం వస్తుందని భావించినప్పటికీ శుక్రవారం ఉదయానికి స్వగ్రామం పర్లకు చేరుతుందని నేవీ అధికారుల నుంచి కుటుంబానికి సమాచారం వచ్చింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడి మృతితో తల్లి లక్ష్మి తల్లడిల్లుతున్న తీరు అందర్నీ కలిచి వేసింది.విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన చందక రామకృష్ణ, లక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడు చందక గోవింద్. గోవింద్ తండ్రి చందక రామకృష్ణ ఏడాది క్రితం మరణించారు. దీంతో అప్పటినుంచి కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటున్నాడు. తల్లి లక్ష్మి, సోదరి, సోదరుడిని పెంచేవాడు. ప్రస్తుతం పారాచూట్ శిక్షణ సమయంలో ప్రమాదంలో గోవింద్ మృతితో.. పెద్దదిక్కును కోల్పోవడంతో వారంతా కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు. గోవింద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చందక గోవింద్ అంత్యక్రియలు మరికాసేపుట్లో జరగనున్నాయి.

* ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం లో రేషన్ బియ్యం లారీ పట్టుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు

కృష్ణా జిల్లా విస్సన్న పేట నుంచి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ వెల్లడి

మొత్తం 20 టన్నులు బియ్యం ఉన్నట్లు వెల్లడించిన రెవెన్యూ అధికారులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులు.

*

బిగ్ బ్రేకింగ్ న్యూస్

ప్రభుత్వ దవాఖానాలో దారుణం ??

డాక్టర్ల నిర్లక్ష్యం, కూలి మహిళ చేతిని తీసివేయాల్సిన పరిస్థితి..

వైద్య విధానాలలో ప్రభుత్వ అనేక పెను మార్పులు తీసుకువచ్చిన నేడు డాక్టర్ల పనితీరు కళ్ళకు కొట్టొచ్చు నట్లు కనిపిస్తోంది

విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నందు అయోమయ స్థితిలో కడు బీద కుటుంబం ….

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట గ్రామానికి చెందిన నంది పాం సురేష్ భార్య తులసి తనకున్న పూరిల్లు సర్దుకునే సమయంలో తెలియని పురుగు ముట్టిందని అనుమానంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లారు

అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు తర్వాత నూజివీడు డాక్టర్ల పరిశీలించి ఇన్ఫెక్షన్ ప్రారంభంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు….

విజయవాడలో చేతికి ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించి కట్లు (డ్రెస్సింగ్) కడుతూ కట్లు మార్చే సమయం లో ఓ సర్జరీ పరికరాన్ని చేతికి వేసి కట్టడంతో చేయి పూర్తిగా ఇన్ఫెక్షన్ అయిందని మామ నంది పాం దానియేలు తెలుపుతున్నారు…..

నందిపం తులసికి ఇద్దరు చిన్నపిల్లలు కావడంతో పిల్లల్ని కూలి పనులకు వెళ్లి పెంచాల్సిన పరిస్థితిలో డాక్టర్లు చేయి తీసేయాలని అనటం తో అయోమయ స్థితిలో ఉన్నావని తెలుపుతున్నారు.

దీనిపై ఉన్నతాధికారులు ప్రభుత్వ స్పందించి ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని విస్సన్నపేట స్థానికులు కోరుకుంటున్నారు

*

తూర్పుగోదావరి జిల్లా

కొవ్వూరు పట్టణంలో శాంతి లాల్ జైన్ తాకట్టు షాపులో జరిగిన నాలుగున్నర కేజీల బంగారం దొంగతనాన్ని చేదించిన పోలీసులు

కొవ్వూరు డిఎస్పి కార్యాలయంలో పత్రికా సమావేశం పాల్గొన్న అడిషనల్ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు

సుమారు కోటి పది లక్షలు బంగారం స్వాధీనం

నిందితుడు బంగారం షాపులో పనిచేస్తున్న గుమస్తా రాము అరెస్ట్

*జైలు నుంచి విడుదలైన బండి సంజయ్

సీపీ రంగనాథ్ పై ఆగ్రహం

కేసు విషయంలో చెప్పిన మాటలన్నీ నిజమేనని పోలీస్ టోపీపై మూడు సింహాలపై ప్రమాణం చేయాలని సవాల్

తనకు సంబంధం లేదని ప్రమాణం చేస్తానన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రేపటి మోడీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు

కరీంనగర్ : పదో తరగతి పరీక్ష లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పై ఈ ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ సీపీ రంగనాథ్ పై మండిపడ్డారు. ఈ కేసులో రంగనాథ్ చెప్పిన విషయాలు నిజమేనా? పోలీస్ టోపీపై ఉన్న మూడు సింహాలపై ఆయన ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. లీకేజీ విషయంలో తనకు సంబంధం లేదని తాను ప్రమాణం చేస్తానని చెప్పారు. పేపర్ లీక్ కి, మాల్ ప్రాక్టీస్ కి తేడా తెలియదా? అని సీపీని ప్రశ్నించారు. ఆయన సంగతి తమకు తెలుసని, ఆయన ఎక్కడెక్కడ ఏం చేశారో అంతా తెలుసన్నారు. పోలీస్ వ్యవస్థను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబంలోనే లీకు వీరులు, లిక్కర్ వీరులు ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి కేటీఆర్ కూడా జైలుకెళ్లడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. టీఎస్ పీఎస్సీ పశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ‘పదో తరగతి హిందీ పేసర్ ఎవరైనా లీక్ చేస్తారా? మరి, హిందీ పేపర్ లీక్ చేసింది మేమైతే.. తెలుగు పేపర్ లీక్ చేసింది ఎవరు? అసలు పరీక్షా కేంద్రానికి మొబైల్ తీసుకెళ్లింది ఎవరు? ఫొటో తీసింది ఎవరు?’ అని సంజయ్ ప్రశ్నించారు. తమకు జైలు, లాఠీ దెబ్బలు కొత్త కాదన్నారు. రేపటి మోదీ సభతో బీజేపీ బలాన్ని నిరూపిద్దామని కార్యకర్తలకు సంజయ్ పిలుపునిచ్చారు.

◾ || రామోజీ కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది … ఏపీ సీఐడీ || ◾

▪️మార్గదర్శి కేసులో ముగిసిన ఏపీ సీఐడీ విచారణ.

▪️A2 మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ నోటీసులు.

▪️ఈ నెల 13న ఎండీ శైలజ విచారణకు హాజరుకావాలని ఆదేశం.

▪️అమరావతి సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశం.

▪️రామోజీ కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది.

*
ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఅర్ పై వైఎస్ షర్మిల గారి కామెంట్స్

వైఎస్ షర్మిల గారు
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

-. ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నట్టు?

– ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు,ముగ్గురిని పడేయడమా?

– లక్షమందికి ఒక డాక్టర్, 10వేల మందికి ఒక నర్సు ఉండటమా?

– కుని ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా?

-. JHS, EHS స్కీములను పాతరేయడమా?

-. 104 పథకాన్ని మూసేయడమా?

– పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొట్టడమా?

-. మీరు హామీ ఇచ్చిన.. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు.

– రాజధానిలో నలుదిక్కులా హెల్త్ హబ్బులు లేవు.

-. ఉస్మానియా హెల్త్ టవర్ లేదు.

– ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టింపులేదు.

-. పరికరాలు, యంత్రాలు పనిచేయకపోయినా దిక్కూమొక్కూ లేదు.

-. మారుమూల గ్రామాలకు అంబులెన్సులు లేవు.

-. దవాఖాన్లలో సిబ్బంది లేరు. ఆసుపత్రి భవనాలు పాతబడి, పెచ్చులూడుతున్నా సోయి లేదు.

– ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారు.

– జబ్బు చేస్తే అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారు.