DailyDose

10 నిముషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.

10 నిముషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.

🌸ప్రతిరోజూ అనవసరమైన ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాము, రోజులో ఒక్క 10 నిమషాలు మీకు ఇష్టమైన దైవ నామాన్ని జపించండి.

🌿ప్రతిరోజూ ఎంతో సమయం ఫోన్, టీవీ చూడడానికి వృథా చేస్తాము. దానిలో ఒక్క 10 నిమషాలు భగవంతుని రూపాన్ని చూస్తూ గడపండి.

🌸ప్రతిరోజూ ఏదో ఆహారపదార్థం ఎంతోకొంత వృథా చేయడమో, పాడయిందని పడేయడమో చేస్తాము అలా పాడవకుండానే ఒక జీవికి ఆహారం అందించి ఆకలి తీర్చండి.

🌿ప్రతీ రోజు పనిలేకపోయిన అనవసరంగా అయినా లేదా వాకింగ్ లో భాగంగా అయినా నడుస్తూ ఉంటాము. దానికి బదులు దేవాలయం చుట్టూ లేదా పవిత్ర వృక్షాల చుట్టూ తిరగండి.

🌸ఆ సమయంలో ఎన్నో ఎన్నో దివ్య తరంగాలు మిమ్మల్ని తాకి మీలో ఒక దివ్య చైతన్యాన్ని నింపుతాయి.

🌿మనకు ఉన్న ఎన్నో సమస్యలను నలుగురికి చెప్పి అవుతాము, ఒక్కసారి అవే సమస్యలు భగవంతుని ముందు కూర్చుని ఆయనకు మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఆయన దానికి ఎదో ఒకరోజున శాశ్వత పరిష్కారం ఇస్తాడు.

🌸ప్రతిరోజూ ఎన్నో వార్తలు, గొడవలు వింటూ ఉంటాము. దానికి బదులు ఒక్క అరగంట మంచి సంగీతం కానీ, సద్గురువులు చెప్పే పురాణ ప్రవచనాలు వినండి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది , ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి.

🌿ప్రతిరోజూ 10 నిముషాలు రామ నామం రాయండి, కొద్దిరోజులకు మీకే ఒక దివ్య అనుభూతి కలుగుతుంది.

🌸ప్రతిరోజూ సూర్యోదయ సమయానికి ముందే లేచి ఉదయిస్తున్న సూర్యుని దర్శించండి.

🌿పూర్ణిమ వెన్నెల వెలుగులో ఆరుబయట ఎక్కువ సేపు గడపండి.

🌸ప్రతీ రోజు భగవద్గీత ఒక్క అధ్యాయం అయినా పారాయణ చేయండి అందులోని ఒక్క శ్లోకానికి అర్ధం తెలుసుకునే ప్రయత్నం చేయండి.

🌿మొక్కలు నాటి వాటిని పొషించండి అవి రేపటి తరాలకు ఎంతో పుష్టినిస్తాయి. ఎంతో మందికి ప్రాణవాయువు అందించిన ఫలం కలుగుతుంది.

🌸వారానికి ఒక్కరోజు అయినా అవుకు కొంచెం ఆహారం సమర్పించండి , గ్రహదోషాలు సమస్యలు తొలగుతాయి..

🌿ఈ విషయాలు ఎప్పుడూ సద్గురువులు, మహానుభావులు చెపుతూనే ఉంటారు. ఒకసారి మళ్ళీ గుర్తుచేసుకుంటున్నాము అంతే

🌸వీటిలో కొన్ని విషయాలు అయినా ఆచరించడం మొదలుపెట్టి అలవాటు చేసుకుందాం…