Movies

సంగీత దర్శకులు శ్రీ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలి చిరంజీవి, పవన్ …

సంగీత దర్శకులు శ్రీ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలి  చిరంజీవి, పవన్ …

తెలుగు సినీ సంగీత ప్రపంచంలో అద్బుతమైన పాటలతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన రాజ్ కోటి సంగీత ద్వయంలో ఒకరైన రాజ్ ఇక లేరు. చిరంజీవి, నాగార్జున లాంటి టాప్ హీరోలకు మ్యూజికల్ హిట్స్ అందించిన రాజ్ ఇక లేరనే వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. రాజ్ మరణంతో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రకటనలో తమ సంతాపం తెలియజేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఇకలేరనే వార్తతో మెగాస్టార్ చిరంజీవి దిగ్బ్రాంతికి గురయ్యారు. తన చిత్రాలకు ఆయన అందించిన మ్యూజిక్‌ను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్ ఆరంభంలో తాను నటించిన చిత్రాలను మ్యూజికల్ హిట్లుగా మలిచిన రాజ్ ప్రతిభను ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. చిరంజీవి ట్విట్టర్‌లో తన సంతాపం తెలిపారు.

ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్ కోటి లలో రాజ్ ఇక లేరు అనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ ఉన్న రాజ్, నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకు అందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రాజ్ అకాల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి ! అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతివార్తను తెలుసుకొన్న పవన్ కల్యాణ్ ప్రత్యేక సంతాప ప్రకటనను రిలీజ్ చేశారు. సినీ సంగీత దర్శకులు శ్రీ రాజ్ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలనాటి సంగీత దర్శకులు శ్రీ టీవీ రాజు గారి వారసుడుగా తనదైన బాణీని చూపారు. తన మిత్రుడు శ్రీ కోటి గారితో కలసి రాజ్ – కోటి ద్వయంగా చక్కటి సంగీతం అందించారు అని తన ప్రకటనలో తెలిపారు

అన్నయ్య చిరంజీవి కెరీర్ ఆరంభంలో నటించిన యముడికి మొగుడు, ఖైదీ నెం.786, త్రినేత్రుడు లాంటి చిత్రాలకు ప్రాచుర్యం పొందిన గీతాలు అందించడంలో శ్రీ రాజ్ గారి భాగస్వామ్యం ఉంది. శ్రీ రాజ్ గారు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ తన సంతాప ప్రకటనలో భావోద్వేగానికి గురయ్యారు.