ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రూ.125.48 కోట్ల రాయితీ మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద 2,562 ట్రాక్టర్లు, 100 హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో పంపిణీ పూర్తిచేశామన్నారు. ఇంకా ఎవరైనా మిగిలితే దరఖాస్తు చేసుకోవాలని.. వారికి అక్టోబర్‌లో యంత్ర పరికరాలను అందజేస్తామని తెలిపారు.
వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించిన జగన్…
