Health

పనస పండులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు….

పనస పండులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు….

పనస పండు వల్ల కలిగే ఉపయోగాలు:

  • పనస ఒక పవర్‌హౌజ్‌ లాంటిది. శక్తిని వెలువరించడంలో దానికి అదే సాటి. కొలెస్ట్రాల్‌ ఏమీ లేకుండా అత్యంత శక్తిని ఇచ్చే ఫ్రక్టోజ్‌ వల్ల ఈ శక్తి సమకూరుతుంది. పనస వల్ల ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని…
  • పనస పండులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ కావడం వల్ల అనేక రకాల క్యాన్సర్లకు స్వాభావిక నివారణిగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లను నివారిస్తుంది.
  • పనసలో మరెన్నో పోషకాలు (ఫైటోన్యూట్రియెంట్స్‌), ఫ్లేవనాయిడ్స్‌ ఉన్నాయి. కణంలో దెబ్బతిన్న డీఎన్‌ఏలను సైతం చక్కదిద్దగల సామర్థ్యం వాటికి ఉంది.
  • పనసలో విటమిన్‌–ఏ పాళ్లు ఎక్కువ. అందుకే అది కంటికి మేలు చేస్తుంది. అదీగాక క్యాటరాక్ట్, మాక్యులార్‌ డీ–జనరేషన్, రేచీకటి వంటి అనేక కంటివ్యాధులను నివారిస్తుంది.
  • థైరాయిడ్‌ గ్రంథికి వచ్చే జబ్బులను నివారించడంతో పాటు థైరాయిడ్‌ జీవక్రియలకు అవసరమైన కాపర్‌ను సమకూరుస్తుంది.
  •  పనస పండు షుగరు వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారంగా చెప్పాలి. దీనిని తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది.
  •  పనస పండులోని కాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే పైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాసు మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
  • ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి, గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.