NRI-NRT

జాక్ డోర్సీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సీరియ‌స్…..

జాక్ డోర్సీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సీరియ‌స్…..

కేంద్ర క్రీడా, స‌మాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ట్విట్ట‌ర్ మాజీ సీఇవో జాక్ డోర్సీ. భార‌త దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేద‌ని ఆరోపించారు. ఆపై తీవ్ర వేధింపుల‌కు పాల్ప‌డ్డారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆనాడు భార‌త్ లో ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేప‌ట్టిన ఆందోళ‌న‌కు సంబంధించి స‌మాచారాన్ని, ఫోటోల‌ను, వీడియోల‌ను షేర్ చేయ‌కుండా, పోస్ట్ చేయ‌కుండా ఉండాల‌ని కేంద్రం ఒత్తిడి తీసుకు వ‌చ్చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇది ఎలా ప్రజాస్వామ్య దేశం అవుతుంద‌ని జాక్ డోర్సీ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఒక్క‌సారిగా ప్ర‌తిప‌క్షాలు సైతం మోదీ ఆధిప‌త్య ధోర‌ణిని, అధికారంతో కూడిన అహంకార‌న్ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా జాక్ డోర్సీ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఈ దేశంలో నిజ‌మైన ప్ర‌జాస్వ‌మ్యం ఉంద‌న్నారు. పూర్తి పార‌ద‌ర్శ‌క‌తో కూడిన ప్ర‌జాస్వామ్యం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో కొన్ని విదేశీ శ‌క్తులు బుర‌ద చ‌ల్ల‌డం ప్రారంభిస్తాయ‌ని మండిప‌డ్డారు కేంద్ర మంత్రి. దీనిని తాము ప‌ట్టించు కోమ‌ని స్ప‌ష్టం చేశారు. ట్విట్ట‌ర్ లో చోటు చేసుకున్న లొసుగులు, త‌ప్పుడు స‌మాచారం గురించి ఎందుకు మాజీ సీఇవో స్పందించ లేద‌ని ప్ర‌శ్నించారు అనురాగ్ ఠాకూర్.