WorldWonders

అత్యధికంగా భారతీయులు వలస వెళ్లే అగ్ర దేశాలు

అత్యధికంగా భారతీయులు వలస వెళ్లే అగ్ర దేశాలు

ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ప్రతియేటా భారతీయులు (Indians) భారీ మొత్తంలో విదేశాలకు వలస వెళ్తుంటారనే విషయం తెలిసిందే. ఇక ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ వలసలలో మనోళ్లే మొదటి స్థానంలో ఉన్నారని తాజాగా వెలువడిన సర్వేలు చెబుతున్నాయి. దాదాపుగా 3.2కోట్ల మంది అలా విదేశాల్లో ఉంటున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వారిలో 18.68 మిలియన్ల మంది భారతీయ సంతతికి చెందినవారైతే… మిగిలిన 13.45 మిలియన్లు ప్రవాస భారతీయులు అని సర్వేలు వెల్లడించాయి. ఇక అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇప్పుడు కార్మికుల కొరత ఏర్పడింది. దాంతో ఆయా దేశాలు ఈ కొరతను పూడ్చడం కోసం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ – స్కిల్డ్ (semi-skilled) నిపుణులను సైతం అవకాశం కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు వివిధ దేశాలకు చెందిన కార్మికులు భారీ మొత్తంలో ఆయా దేశాలకు క్యూడతున్నారు. దీంతో ఇప్పుడు విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే ప్రజల కోరిక ఆల్ టైం హైకి చేరిందని సమాచారం.ఇదిలాఉంటే.. తాజాగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ప్రకటించిన డేటా ప్రకారం… 2021లో 7,88,284 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకుని అగ్రరాజ్యం అమెరికాలో  స్థిరపడ్డారు. యూఎస్ తర్వాత 23,533 మందితో ఆస్ట్రేలియా  రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కెనడా (21,597), బ్రిటన్ (14,637 ), ఇటలీ (5,986), సింగపూర్ (2,516), న్యూజిలాండ్ (2,643), జర్మనీ (2,381), స్వీడన్ (1,841), నెదర్లాండ్స్ (2,187), స్పెయిన్ (1,595) కు వెళ్లినట్లు మినిస్ట్రీ డేటా ద్వారా తెలిసింది. ఇక సుమారు 40లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తుంటే.. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  లో సుమారు 30.5 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియా  లో 2.5 మిలియన్ల మంది నివస్తున్నారని డేటా వెల్లడించింది.