WorldWonders

టమాటా తోటకు సీసీటీవీలు

టమాటా తోటకు సీసీటీవీలు

ప్రస్తుతం టమాటా ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టమాటా (Tomato)ల రక్షణకు రైతులకు ప్రత్యేక రక్షణ చర్యలు అవసరం అవుతున్నాయి. యూపీలోని ఓ వ్యాపారి తన టమాటాలకు ఇటీవలే బాడీగార్డులను ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన రైతు సోదరులు టమాటా తోటకు సీసీటీవీ కెమెరాల (CCTV Camera)ను ఏర్పాటు చేసి.. తమ వ్యవసాయ క్షేత్రంలో కదలికను గమనిస్తున్నారు.