Devotional

ఈ రాశివారికి కొత్త ఉద్యోగావకాశాలు

ఈ రాశివారికి కొత్త ఉద్యోగావకాశాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 29.08.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (29-08-2023)

కెరీర్ పరంగా యాక్టివిటీ పెరుగుతుంది. అనేక వ్యవహారాలను ఏకకాలంలో పూర్తి చేయాలనుకుంటారు. వీటికి తోడు వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను, ప్రణాళికలను ప్రవేశపెడతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (29-08-2023)

వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. మీ ప్రతిభకు, నిబద్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆదాయం, ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా, సంతృప్తికరంగా ఉంటాయి. సొంత వ్యవహారాలు, పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహా రాలను చక్కబెడతారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (29-08-2023)

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి విలువ బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తండ్రి వైపు వారి నుంచి శుభవార్తలు అందు తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడికి లోటు ఉండదు. ప్రభుత్వపరంగా కూడా లబ్ధి పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (29-08-2023)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి జీవితం కూడా వేగం పుంజుకుంటుంది. వృత్తి, వ్యాపారా లను విస్తరించే సూచనలున్నాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఇతరులకు ఇబ్బడిముబ్బడిగా సహాయం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకోవడం ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషదాయక వాతావరణం నెలకొంటుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. కొద్దిగా డబ్బు నష్టపోతారు.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (29-08-2023)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ముఖ్యంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. పిల్లల నుంచి చదువుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యక్తిగత కార్యకలాపాలు కూడా పెరిగిపోతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు వేగంగా పూర్తయిపోతాయి.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (29-08-2023)

ఉద్యోగానికి సంబంధించిన ఏ వ్యవహారమైనా సానుకూలంగా పూర్తవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి క్రమక్రమంగా బయటపడడం జరుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరుకాయలన్నట్టుగా సాగిపోతుంది. వ్యాపా రాలు పరవాలేదనిపిస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఒకరిద్దరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందు తాయి.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (29-08-2023)

డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆర్జన అవకాశాలు పెరుగుతాయి. వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపా రాల్లో రాబడి పెరిగి, విస్తరణ గురించి ఆలోచిస్తారు. నిరుద్యోగులకు స్వదేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (29-08-2023)

ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. బరువు బాధ్యతల కారణంగా విశ్రాంతి ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. అవసరానికి డబ్బు అందుతుంది. డబ్బు ఇవ్వాల్సినవారు తీసుకు వచ్చి ఇస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో కొన్నివ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి సమస్యేమీ ఉండదు. ఇల్లు మారడానికి ప్రయత్నాలు సాగిస్తారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. స్నేహితుల వల్ల ఇబ్బందులుంటాయి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (29-08-2023)

ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటే అన్ని పనులూ సానుకూలపడతాయి. గ్రహాల అనుకూలత బాగా ఉన్నందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆర్థికపరంగా ముందుకు దూసుకుపోతాయి. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకువెడతారు. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ జీవితంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (29-08-2023)

వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం ఉంటాయి. వృత్తిపరంగా ముందడుగు వేయడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుం డదు. ఉద్యోగం మారడానికి, ఉద్యోగంలో మార్పులు రావడానికి చేసే ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (29-08-2023)

అటు వృత్తి, ఉద్యోగాల్లోనూ, ఇటు కుటుంబంలోనూ బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ, కొద్దిగా మనశ్శాంతి లోపి స్తుంది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని, విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. బంధువుల రాకపోకలుంటాయి. ఒక శుభ కార్యం గురించి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి కొన్ని ఇష్టమైన ఆలయాల సందర్శన చేస్తారు.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (29-08-2023)

ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉప శమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఆశించినంతగా తగ్గుముఖంపడతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు.
🦈🦈🦈🦈🦈🦈🦈