DailyDose

తెలుగు అధికార భాషా సంఘం ఆహ్వాన పత్రికలో అక్షర దోషాలు

తెలుగు అధికార భాషా సంఘం ఆహ్వాన పత్రికలో అక్షర దోషాలు

తెలుగు అధికార భాషా సంఘం అధిపతి విజయబాబుపై తీవ్రసాయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తేట తెలుగుపై గొప్ప గొప్ప మాటలు చెప్పే ఆయన గిడుగు పురస్కార గ్రహీతలకు పంపిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అందులో ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది అక్షర దోషాలు ఉండడంతో… అతిధులు కూడా విస్తుపోతున్నారు.రాజకీయాలకు అతీతంగా సంఘాన్ని నడిపించాల్సిన విజయబాబు నిరంతరం సీఎం జగన్ ప్రాపకం కోసం పరితపిస్తుంటారని విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ప్రతిపక్ష నేతలకు తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పిస్తామంటూ వ్యాఖ్యలు చేసేవారు. అలాంటాయన తెలుగు భాషా పటిమ ప్రస్తుతం తెలుగు భాషాభిమానులను నివ్వెర పోయేలా చేస్తుంది.

తెలుగుకు ఇదేం తెగులు రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు భాషాభిమానులు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి. ఆయన జయంతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా సంఘం తెలుగు వారోత్సవాలుగా నిర్వహిస్తోంది. గిడుగు రామ్మూర్తి జయంతి వారోత్సవాల సందర్భంగా కొంతమంది సాహితీవేత్తలను గిడుగు పురస్కారానికి ఎంపిక చేసింది.మంగళవారం నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమాల్లో ఈ పురస్కారాలను అందించనుంది. ఈ కార్యక్రమానికి పురస్కార గ్రహీతలను ఆహ్వానిస్తూ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు ఓ ఆహ్వాన పత్రికను వాట్సాప్ లో పంపారు.
ఈ ఆహ్వాన పత్రికలో 10 వరసలు ఉన్న పేరాలో 9 పదాల్లో అక్షర దోషాలు కనిపించాయి.

ఇప్పుడు ఇదే విపరీతంగా ట్రోలింగుకు గురవుతోంది. ఎక్కువలో ఎక్కువగా దీర్ఘం, గుడి దీర్ఘం, ఒత్తులే తప్పులు కనిపిస్తున్నాయి. ఇవి కూడా సరిగా రాయడం రాదా అంటూ మండిపడుతున్నారు తెలుగు భాషాభిమానులు. తప్పులు దొర్లిన వాటిలో.. ‘గ్రహిత… తేది… నిర్వహిస్తున… గౌరవనియులైన.. ఆహ్వాన్నాని…’ఇలా దాదాపు ప్రతి వాక్యంలోనూ తప్పులు కనిపించాయి.

చివరకు వస్తే తమ సంస్థ పేరును కూడా సక్రమంగా రాయలేకపోయారు. ‘తెలుగు భాషాబివృధి ప్రాధికార సంస్థ’ అన్నారు. ఈ తప్పులతో కూడిన ఆహ్వాన పత్రికను మొదట పంపించిన తర్వాత… విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని సరి చేస్తూ మరో ఆహ్వాన పత్రికను పంపించారు.