Business

ప్రపంచ కప్ హోటల్‌కి మంచి డిమాండ్‌

ప్రపంచ కప్ హోటల్‌కి మంచి డిమాండ్‌

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 సందర్భంగా ఆతిథ్యం ఇస్తున్న ఉత్తర ప్రదేశ్లో హోటళ్లకు గిరాకి బాగా పెరిగిపోయింది. ఇప్పటికే అన్ని హోటళ్లు బుక్ అయిపోయాయి.. దాదాపు మూడు రెట్లు రెంట్ చెల్లించి మరీ అద్దెకు తీసుకున్నారు క్రికెట్ అభిమానులు.

లక్నోలోని లగ్జరీ హోటళ్లకు సగటున రోజుకు రూ.5వేల నుంచి రూ.11వేలకు వరకు ఛార్జ్ చేస్తారు. అయితే మ్యాచ్‌ల రోజుల్లో హోటళ్లు రోజుకు రూ.40 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. గోమతి నది ఒడ్డున ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌లో రోజుకు రూ.11,000 చార్జీలు వసూలు చేస్తూ అక్టోబర్ 25, 26 తేదీలకుగాను రూ.40 వేలకు పెంచారు.

లక్నో -కాన్పూర్ హైవేలోని మరో ఫైవ్ స్టార్ హోటల్ టారిఫ్‌ను రూ. 79,000కు పెంచగా, మాల్ అవెన్యూ ప్రాంతంలోని మరో ప్రధాన హోటల్‌లో కీలక మ్యాచ్ రోజుల కోసం ‘సోల్డ్ అవుట్’ బోర్డు పెట్టారు. ఇతర మంచి హోటళ్లలోనూ ఇదే పరిస్థితి. నవంబర్ 3 వరకు కొనసాగుతుందని హోటల్ యజమానులు అంటున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత లక్నో నగరం ప్రపంచ కప్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దమైంది. ప్రసిద్ది చెందిన హోటళ్లు, వ్యాపార సముదాయాలు ఇక్కడ ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్లు నిర్వహిస్తున్న లక్నో నగరంలో హోటల్ పరిశ్రమను బలోపేతం చేసి పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇది యూపీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదం పడుతోంది.