NRI-NRT

సింగపూర్ అధ్యక్షుడిగా ధర్మన్ షణ్ముగరత్నం

సింగపూర్ అధ్యక్షుడిగా ధర్మన్ షణ్ముగరత్నం

భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త ధర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ నగర-రాష్ట్ర తొమ్మిదో అధ్యక్షుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 66 ఏళ్ల ధర్మన్ ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. తొలి మహిళాధ్యక్షురాలు హలీమా యాకోబ్ పదవీకాలం సెప్టెంబర్ 13తో ముగిసింది. గణనీయ సంఖ్యలో ఉన్న చైనీయుల మద్దతును షణ్ముగరత్నం పొందగలిగారు. ఆయన 2019-2023 మధ్య కాలంలో మంత్రిగా పనిచేశాడు. 2015 – 2023 మధ్య సామాజిక విధానాల సమన్వయ మంత్రిగా చేశారు. 2011 – 23 మధ్య కాలానికి సింగపూర్ మానిటరీ అథారిటీ చైర్మన్ గా ఉన్నారు. గతంలో ఉప ప్రధాన మంత్రిగా కూడా పనిచేశారు. సింగళ దేశానికి గతంలోనూ ఇద్దరు భారత సంతతి వ్యక్తులు అధ్యక్షులుగా పని చేశారు. వారిలో సెల్లపన్ రామనాథన్, దేవన్ నాయర్ ఉన్నారు.