Business

EMI ఎగ్గొట్టేవారికి SBI సరికొత్త పథకం : వాణిజ్యం

EMI ఎగ్గొట్టేవారికి SBI సరికొత్త పథకం : వాణిజ్యం

* చేతివృత్తుల వారు, సంప్రదాయ హస్తకళాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రధాన ‌మంత్రి నరేంద్ర మోదీ తాజాగా ప్రారంభించారు. ఈ పథకం కింద సంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి పూచీకత్తు అవసరం లేకుండా అతి తక్కువ వడ్డీకి రుణసాయం అందిస్తారు. ఐదేళ్ల కాలానికి రూ. 13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో ఈ పథకం చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ కార్మికులు, బార్బర్‌లతో సహా సంప్రదాయ హస్తకళాకారులకు చెందిన 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సాంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారి ఉత్పత్తులు, సేవల్లో నాణ్యతను పెంచి తద్వారా వారికి మరింత ఆదరణను పెంచడమే ఈ పథకం లక్ష్యం.

* ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అనేది బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా అందించబడిన స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలుగా ఉంటుంది. ఇందులో మీరు స్థిరమైన రేటుతో వడ్డీని పొందుతారు. అకాల నిధుల ఉపసంహరణ అనుమతించబడనప్పటికీ ఫెనాల్టీ చెల్లించడం ద్వారా అలా చేయవచ్చు. మరోవైపు పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు ఆదా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇది స్వల్పకాలిక ఎఫ్‌డీలకు భిన్నంగా ఉంటాయి. అలాగే ఇవి ఐదేళ్ల వ్యవధిలో లాక్‌ని కలిగి ఉంటాయి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందుగా నిర్ణయించిన వడ్డీ రేట్ల రూపంలో పన్ను ప్రయోజనాలతో పాటు హామీతో కూడిన రాబడిని అందిస్తాయి.

* ప్రముఖ భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్స్‌ (ఎస్‌బీఐ ఎస్‌సీఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

* జూన్ 2023 త్రైమాసికంలో ఎస్‌బీఐ రిటైల్ రుణాల కేటాయింపు 16.46 శాతం పెరిగి రూ.12,04,279 కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.10,34,111 కోట్లుగా ఉంది. బ్యాంకు మొత్తం రుణ ఖాతా 13.9 శాతం పెరిగి రూ.33,03,731 కోట్లకు చేరింది. ఈ పథకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా ప్రత్యేకమైనది. ఇందులో, ఖాతాదారుడు సకాలంలో చెల్లింపు చేయడం లేదని బ్యాంకు భావిస్తే.. బ్యాంకు అతని ఇంటికి చాక్లెట్లను పంపుతుంది. ఈఎంఐ చెల్లించని కస్టమర్ తరచుగా బ్యాంక్ రిమైండర్ కాల్‌లకు స్పందించడం లేదని బ్యాంక్ తెలిపింది. నిర్దిష్ట కస్టమర్ చెల్లింపు చేయకూడదని అనుకుంటున్నట్లుగా బ్యాంకు అనుకుంటుంది. అటువంటి పరిస్థితిలో వారి ఇంటి వద్దకు నేరుగా ఓ చాక్లెట్ ఇవ్వడం ద్వారా చెల్లింపు చేయమని బ్యాంకు వారికి గుర్తు చేస్తుంది. ఎస్‌బీఐ ఈ ప్రచారం బ్యాంకింగ్ పరిశ్రమలో రిటైల్ రుణాలు పెరిగిన సమయంలో తీసుకొచ్చింది. రిటైల్ రుణాల పెరుగుదలతో.. నెలవారీ ఈఎంఐ డిఫాల్ట్ కేసులు కూడా పెరిగాయి. అన్ని బ్యాంకులు ఈఎంఐ, తిరిగి చెల్లింపు కోసం అనేక రకాల ప్రచారాలను నడుపుతున్నాయి. ఎస్‌బీఐ ఈ చాక్లెట్ పథకం మెరుగైన రికవరీని నిర్ధారించే ప్రయత్నం కూడా.

* కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌కు చెందిన కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(కేడీఎంఎస్‌ఎల్‌)పై ఐబీసీ సెక్షన్‌-7 కింద దివాలా పరిష్కార ప్రక్రియ మొదలైంది. ఈ సంస్థపై దిల్లీకి చెందిన అలైడ్‌ హైటెక్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌), హైదరాబాద్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేయగా, దాన్ని విచారించిన అనంతరం దివాలా ప్రక్రియకు అనుమతి ఇస్తూ బెంచ్‌ సభ్యులు డాక్టర్‌ వెంకట రామకృష్ణ బదరీనాథ్‌ నందుల, చరణ్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. దివాలా ప్రక్రియను నిర్వహించడానికి క్రాంతి కుమార్‌ కేదారిని ఇంటరిమ్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌(ఐఆర్‌పీ)గా నియమించారు. ఈ కేసులో పిటిషనర్‌ తరఫున వీవీఎస్‌ఎన్‌ రాజు న్యాయవాదిగా వ్యవహరించారు. అలైడ్‌ హైటెక్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫైనాన్షియల్‌ క్రెడిటార్‌ హోదాలో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం ఈ సంస్థ, కేడీఎంఎస్‌ఎల్‌కు 2019లో ఆరు దఫాలుగా మొత్తం రూ.16 కోట్లు ఐసీడీ(ఇంటర్‌ కార్పొరేట్‌ డిపాజిట్‌) రూపంలో 13 శాతం వార్షిక వడ్డీకి అప్పు ఇచ్చింది. తర్వాత ఎంత అడిగినా అప్పు తీర్చ లేదు. పైగా దీనిపై వడ్డీ కూడా పేరుకుపోయింది. దీంతో కేడీఎంఎస్‌ఎల్‌ అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.18.62 కోట్లు తనకు బకాయి పడినట్లు, అందువల్ల ఈ సంస్థపై దివాలా ప్రక్రియ చేపట్టాలని ఎన్‌సీఎల్‌టీని అలైడ్‌ హైటెక్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోరింది. దీనికి బదులుగా కేడీఎంఎస్‌ఎల్‌ పలు అభ్యంతరాలను లేవనెత్తింది. పిటిషనర్‌ ‘కార్పొరేట్‌ పర్సన్‌’ కాదని, తనపై ఐబీసీ సెక్షన్‌-7 కింద విచారణ చేపట్టడానికి వీల్లేదని, పైగా ఇరుపక్షాల మధ్య ఉన్న వివాదాన్ని దిల్లీ హైకోర్టు మీడియేషన్‌ అండ్‌ కన్సీలియేషన్‌ సెంటర్‌ ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నామని కేడీఎంఎస్‌ఎల్‌ వివరించింది. కానీ అభ్యంతరాలను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చడమే కాక, కేడీఎంఎస్‌ఎల్‌పై దివాలా ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. తదుపరి చర్యగా ఐఆర్‌పీని నియమించి దివాలా ప్రక్రియ చేపట్టే నిమిత్తం ‘పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌’ జారీ చేయాలని సూచించింది. అంతేగాక ఈ ప్రక్రియ ముగిసే వరకూ కేడీఎంఎస్‌ఎల్‌ ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధం విధించింది.