Food

పెప్పర్‌ ఎక్స్‌ మిర్చి – కొరికితే అంతే సంగతి

పెప్పర్‌ ఎక్స్‌ మిర్చి – కొరికితే అంతే సంగతి

మిరపకాయ అంటేనే కారం. పొరపాటున నోట్లో పెట్టుకున్నామంటే నెత్తీనోరూ బాదుకోవాల్సిందే. ఆ ఘాటైన కారానికి కారణం అందులో ఉండే క్యాప్సైసిన్‌. దాని మోతాదును బట్టే ఘాటును నిర్ణయిస్తారు. మరి ప్రపంచంలోనే అత్యధికంగా క్యాప్సైసిన్‌ కలిగి ఉన్న ఘాటైన మిర్చి ఏదో తెలుసా. అదే ‘పెప్పర్‌ ఎక్స్‌’… ఈ మిర్చిని తినడం మాట అలా ఉంచి, వాసన చూస్తేనే ముక్కూకళ్లూ మండిపోతాయట. అమెరికాలోని సౌత్‌ కరోలినాకి చెందిన పుకర్‌బట్‌ పెప్పర్‌ కంపెనీ వ్యవస్థాపకుడు ఎడ్‌ క్యూరీ దాదాపు పదేళ్లపాటు ప్రయోగాలు చేసి… ఘాటైన మిరప జాతులతో సంకరీకరించి పెప్పర్‌ ఎక్స్‌ను వృద్ధి చేశాడు. గతంలో ఎడ్‌ వృద్ధి చేసిన ‘కరోలినా రేపర్‌’ స్పైసీ మిర్చి ప్రపంచంలోనే ఘాటైందిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పెప్పర్‌ ఎక్స్‌తో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు ఎడ్‌. ప్రపంచంలోనే స్పైసీ మిర్చిని వృద్ధి చేసినందుకుగానూ ఈ మధ్యనే ఎడ్‌కి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు దక్కింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z