Politics

భాజపా అభ్యర్థుల తరఫున పవన్‌ ఎన్నికల ప్రచారం

భాజపా అభ్యర్థుల తరఫున పవన్‌ ఎన్నికల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులతో పాటు కూటమిలో ఉన్న భాజపా అభ్యర్థుల తరఫున పవన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బుధవారం వరంగల్‌ వెస్ట్‌ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్‌గౌడ్‌కు మద్దుతగా, 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే.. తెలంగాణలో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగసభల్లోనూ అధికారికంగా పవన్‌ హాజరుకానున్నారు.

ఎన్నికల్లో భాజపాతో ఒప్పందం కుదుర్చుకున్న జనసేన తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న భాజపాకు మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో ఇరుపార్టీల అగ్ర నాయకులు తమ అభ్యర్థుల తరఫున విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారనేది జనసేన, భాజపా శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z