Politics

అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం

అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ఇవాళ నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లకు సంబంధించి గడువు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అందులో ఒకే ఒక నామినేషన్ దాఖలు అయింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. రేపు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ వికారాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి డాక్టర్ మెటుకు ఆనంద్‌పై 12,893 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పై గెలుపొందారు. గడ్డం ప్రసాద్‌కు మొత్తం 86,885 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 73,992 ఓట్లు వచ్చాయి. 2009లో గడ్డం ప్రసాద్ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై నమ్మకంతో వికారాబాద్ టికెట్ కేటాయించింది. ఈసారి 12 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ముందుగా ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. స్పీకర్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. స్పీకర్ పదవి చేపట్టేందుకు శ్రీధర్ బాబు ఆసక్తి చూపలేదు. దీంతో.. మంత్రిగా పని చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్‌గా నియమించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z