Business

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు-వాణిజ్య వార్తలు

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు-వాణిజ్య వార్తలు

* భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ మరోసారి జీవనకాల గరిష్ఠానికి చేరాయి. సెన్సెక్స్‌ 851.63 పాయింట్లు పెరిగి 70వేల పాయింట్ల ఎగువ ట్రేడవుతున్నది. నిఫ్టీ 230 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 70,433.82 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21,163.15 పాయింట్ల వద్ద నిఫ్టీ టేడ్రవుతున్నది. ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయం తీసుకున్నది. ద్రవ్యోల్బణం ఇంకా 2శాతం లక్ష్యం కంటే ఎగువన ఉండడంతో కఠిన వైఖరిని కొనసాగిస్తూ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం దేశీయ మార్కెట్ల సానుకూల ప్రభావం చూపింది. ఈ క్రమంలో సూచీలు మరోసారి జోరును కొనసాగిస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 665 పాయింట్ల లాభంతో 70,249 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 21,112 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలోనూ అదే రోజును కొనసాగిస్తున్నాయి. ఇక ట్రేడింగ్‌లో టెక్‌ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ ట్రీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలువగా.. పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, నెస్లే, బీపీసీఎల్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.

 బీహార్‌లో 8700 కోట్ల పెట్టుబ‌డి

అదానీ గ్రూపు(Adani Group) భారీ ప్ర‌క‌ట‌న చేసింది. బీహార్ రాష్ట్రంలో సుమారు 8700 కోట్ల మేర పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు చెప్పింది. ఆ పెట్టుబ‌డి ద్వారా సుమారు ప‌ది వేల ఉద్యోగాల‌ను క్రియేట్ చేయ‌నున్న‌ట్లు అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ డైరెక్ట‌ర్ ప్ర‌ణ‌వ్ అదానీ తెలిపారు. బీహార్ బిజినెస్ క‌నెక్ట్ 2023 మీటింగ్‌కు హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ .. బీహార్ పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ కేంద్రంగా మారింద‌న్నారు. మార్పు స్ప‌ష్టంగా ఉంద‌ని, సామాజిక మార్పు క‌నిపిస్తోంద‌న్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు, అక్ష‌రాస్య‌త‌, మ‌హిళా సాధికార‌త లాంటి అంశాల్లోనూ బీహార్ ఉత్త‌మ విధానాలు పాటిస్తోంద‌న్నారు. సీఎం నితీశ్ కుమార్ అభివృద్ధి మంత్రాన్ని అదాన్నీ గ్రూపు స్వాగ‌తిస్తున్న‌ట్లు ప్ర‌ణ‌వ్ తెలిపారు. బీహార్‌లో లాజిస్టిక్స్‌, గ్యాస్ డిస్ట్రిబుషన్ రంగాల‌కు ఇప్ప‌టికే త‌మ కంపెనీ దాదాపు రూ.850 కోట్లు ఇచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

అమెజాన్ కు కేంద్రం నోటీసులు!

అమెజాన్ ప్రైమ్ సబప్షన్కు సంబంధించి సంస్థకు కేంద్రం నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కస్టమర్లను మభ్య పెట్టే విధంగా వెబ్సైట్ ఉన్నట్లు నోటీసుల్లో పేర్కొంది. గతనెల సంస్థకు నోటీసులు రాగా ఇటీవల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఒక్క క్లిక్తో సబ్ప్ర్కైబ్ చేసుకునేలా డిజైన్ చేశారు. కానీ క్యాన్సిలేషన్కు పెద్ద ప్రక్రియ ఉంది. క్యాన్సిల్ ఆప్షన్ కనపడకుండా దాచి ఓ ట్రాప్ క్రియేట్ చేసింది’ అని మండిపడింది.

* భారీగా పెరిగిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్లలో బుల్లిష్ ధోరణి నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర (24 క్యారెట్స్) గురువారం ఒక్కరోజే భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో తులం (24 క్యారెట్స్) బంగారం ధర రూ.1,130 పెరిగి రూ.62,950 వద్దకు దూసుకెళ్లిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. బుధవారం ఢిల్లీలో తులం బంగారం రూ.61,820 పలికింది. మరోవైపు, కిలో వెండి ధర కూడా రూ.2350 పుంజుకుని రూ.77,400 వద్ద స్థిర పడింది. బుధవారం కిలో వెండి ధర రూ.75,050 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 2032 డాలర్లు, ఔన్స్ వెండి ధర 24 డాలర్లు పలికింది. బుధవారం ధరతో పోలిస్తే గురువారం ఔన్స్ బంగారం 51 డాలర్లు పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. వడ్డీరేట్ల పెంపు క్యాంపెయిన్ ముగిసిందని, వచ్చే ఏడాది నుంచి వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వు ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలోపేతమైంది. కామెక్స్ గోల్డ్ ధర 2.5 శాతం పెరిగిందన్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం నేపథ్యంలో అమెరికా ట్రెజరీ బాండ్లు, డాలర్ ఇండెక్స్ ధరలు పడిపోవడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం తులం (24 క్యారెట్స్) ధర రూ.1276 పెరిగి రూ.62,475 పలికింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి గోల్డ్ కాంట్రాక్ట్స్ డెలివరీ ధర 2.09 శాతం రూ.1,276 పుంజుకుని రూ.62,475 వద్ద నిలిచింది. న్యూయార్క్‌లో ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 2.51 శాతం పెరిగి 2047.40 డాలర్ల వద్ద నిలిచింది.

* IPL అభిమానులకు శుభవార్త

IPL అభిమానులకు జియో కంపెనీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 19న జరిగే వేలం ప్రక్రియను జియో సినిమా యాప్లో ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించింది. ఆ రోజు మ.2.30 గంటల నుంచి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. దుబాయ్ జరిగే వేలంలో మొత్తం 333 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. అందులో 214 మంది భారత ప్లేయర్లు కాగా 119 మంది విదేశీ క్రికెటర్లు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z