DailyDose

అన్న అక్క కూడా కారుణ్య నియామకాలకు అర్హులే!

అన్న అక్క కూడా కారుణ్య నియామకాలకు అర్హులే!

అవివాహితుడైన ప్రభు త్వ ఉద్యోగి మృతి చెందితే.. మృతుడి తమ్ముడు, చెల్లెలితో పా టు అన్న, అక్కకు కూడా కారుణ్య నియామకం కింద ఉద్యో గం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు జీవో 612లో కీలక సవరణలు చేసి.. కొత్తగా జీవో 18 జారీ చేసింది. వివరాలివీ.. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరబన్నపాలేనికి చెందిన ఎస్‌.మహేష్‌ అనే వ్యక్తి గ్రేహౌండ్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2022లో మృతి చెందారు. మృతు డు అవివాహితుడు కావడంతో కారుణ్య నియామకం కింద అతడి అన్న ఎస్‌.అప్పలరాజుకు ఉద్యోగం కోరుతూ తల్లి ఎస్‌.కాంతమ్మ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే నిబంధనల మేరకు తమ్ముడికే అర్హత ఉంటుందని, అన్న అర్హుడు కాదని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో మృతుడి తల్లి రాష్ట్ర లోకాయుక్తను ఆశ్రయించింది. కేసును విచారించిన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణ రెడ్డి.. కారుణ్య నియామకానికి మృతుని అన్న అర్హుడు కాదనే నిబంధన సహజ సూత్రాలకి వ్యతిరేకమని, ఫిర్యాది అభ్యర్థనలను పరిశీలించాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం జీవో18ని జారీ చేసింది. దీనిని అనుసరించి మృతుడి అన్నకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్లు విశాఖ కలెక్టర్‌ ద్వారా లోకాయుక్తకు తెలియజేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z