DailyDose

డ్రగ్స్‌పై సమాచారం ఉంటే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

డ్రగ్స్‌పై సమాచారం ఉంటే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

ఒక నేరస్థుడికి శిక్ష పడితే.. నేరం చేయాలనుకునే 100 మందిలో భయం వస్తుందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి (Kothakota Srinivasa Reddy) అన్నారు. కమిషనరేట్‌లోని ఉన్నతాధికారులు, ఇన్‌స్పెక్టర్‌లు, సిబ్బందితో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఠాణాలకు వచ్చి ఫిర్యాదు చేసే వారిపట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని, ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

మాదకద్రవ్యాలు నగరంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సీపీ (Hyderabad CP) దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల దర్యాప్తులో దేశంలోనే హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉందని.. ఇప్పటికే మన వద్ద ఉన్న వ్యవస్థను ఉపయోగించుకుని కేసులు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలన్నారు. రికవరీ రేటును మరింత పెంచాలని సిబ్బందిని సీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

డ్రగ్స్‌పై 87126 71111కు సమాచారం ఇవ్వండి: సందీప్‌ శాండిల్య
డ్రగ్స్ రహిత తెలంగాణే ధ్యేయంగా టీఎస్‌ న్యాబ్ పనిచేస్తుందని డైరెక్టర్ సందీప్ శాండిల్య పేర్కొన్నారు. టీఎస్‌ న్యాబ్ వ్యవస్థ, పనితీరుపై ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘ఈ నెల 12న టీఎస్‌ న్యాబ్ డైరెక్టర్‌గా నియమితులయ్యాను. ముఖ్యమంత్రి వద్ద రెండు గంటపాటు టీఎస్‌ న్యాబ్ వ్యవస్థ, డ్రగ్స్ నియంత్రణకు చేసిన కృషిపై వివరించాం. టీఎస్‌ న్యాబ్.. గ్రే హౌండ్స్, అక్టోపస్ తరహా సంస్థలా మారాలి. డ్రగ్స్‌ నివారణకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలి. పిల్లలు డ్రగ్స్‌ బారిన పడకుండా తల్లిదండ్రులు చూడాలి. విద్యాసంస్థలు, ఐటీ, ఫిల్మ్‌ ఇండస్ట్రీ, బార్లు, పబ్‌లు, రేవ్‌ పార్టీలు, రిసార్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. డ్రగ్స్‌పై సమాచారం ఉంటే 87126 71111 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి’’ అని శాండిల్య సూచించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z