Devotional

అయోధ్య రామమందిరంలో నేడు ఒక కీలక ఘట్టం

అయోధ్య రామమందిరంలో నేడు ఒక కీలక ఘట్టం

అయోధ్యలో భవ్య రామాలయం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈలోపు శ్రీరామ పాదుకా యాత్రలో భాగంగా దేశ వ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాలమీదుగా పూజలందుకుంటూ శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకోనున్నాయి.

9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండి వాడారు. కిలో బంగారంతో పాదుకలకు తాపడం చేశారు. హైదరాబాద్‌కు చెందిన అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈ పాదుకలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z