Business

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు- వాణిజ్య వార్తలు

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు- వాణిజ్య వార్తలు

* గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునే ప్రక్రియను వేగవంతం చేసిన గౌతమ్ అదానీ

గ్రీన్ ఎనర్జీ రంగంలో పోటీ పడేందుకు బిలియనీర్ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం 1 బిలియన్ డాలర్ల(రూ. 8,325 కోట్ల) పెట్టుబడులు పెట్టనుంది. అదానీ గ్రూపునకు చెందిన పునరుత్పాదక ఇంధన విభాగంలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది మెచ్యూర్ అవనున్న బాండ్లు ఉన్న నేపథ్యంలో గ్రూప్ ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునే ప్రక్రియను వేగవంతం చేస్తోంది.అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విస్తరణ, రీఫైనాన్సింగ్ అవసరాలను తీర్చేందుకు కంపెనీ వ్యవస్థాపకులు తమ వాటాలో కొంత విక్రయించనున్నారని సంబంధిత వ్యక్తులు తెలిపారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి చర్చలు గోప్యంగా జరుగుతున్నాయని, త్వరలో అధికారిక వెల్లడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.ఈ నెల 26న కంపెనీ బోర్డు నిధుల సేకరణ విషయమై ప్రతిపాదనలు ఉంచనుంది. షేర్లు లేదా కన్వర్టబుల్ సెక్యూరిటీలను విక్రయించడం, ఇతర అవకాశాలను అన్వేషించడాన్ని పరిశీలించనుంది. కాగా, కంపెనీ 2030 నాటికి 45 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని లక్ష్యంగా కలిగి ఉన్న సంగతి తెలిసిందే.

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు 

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపరులు అమ్మకాలకు దిగడంతో గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. సెన్సెక్స్‌ 350కి పైగా షేర్లతో లాభాల్లో ముగియగా.. నిఫ్టీ 21,250 పాయింట్ల ఎగువన ముగిసింది.సెన్సెక్స్‌ ఉదయం 69,920.89 వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఆపై రోజంతా లాభాల్లో కదలాడింది. ఇంట్రాడేలో 69,920.39 – 70,930.69 మధ్య కదలాడిన సూచీ.. కనిష్ఠాల నుంచి ఏకంగా వెయ్యి పాయింట్ల మేర లాభపడింది. చివరికి 358.79 పాయింట్ల లాభంతో 70,865.10 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 104.90 పాయింట్లు లాభపడి 21,255.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.27గా ఉంది.

ఎక్స్‌లో పోస్టులు మాయం

అమెరికన్‌ టైకూన్‌, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ( Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ (ఎక్స్‌) ఇటీవలే మాటిమాటికీ సతాయిస్తోంది. ఏదో ఒక సమస్యతో యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటీవలే ట్విట్టర్‌ సేవల్లో అంతరాయం ఏర్పడటం.. లాగిన్‌లో సమస్యలు వంటివి తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఎక్స్‌లో ఇలాంటి సమస్యే తలెత్తింది.అయితే, ఈ సారి ట్వీట్స్‌ మాయం అయ్యాయి (posts not loading). దీంతో యూజర్లు ఒకింత గందరగోళానికి గురవుతున్నారు. గురువారం ఉదయం నుంచి దేశ ప్రధాని మోదీ సహా చాలా మంది ట్విట్టర్‌ పోస్టులు కనిపించడం లేదు. ఆయా ఖాతాల్లోని పోస్టులు లోడ్‌ అవ్వడం లేదు. పోస్టులు మాయం అవ్వడంతో యూజర్లు ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. ఏం జరిగిందో అర్థం కాక ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ సమస్యపై ఎక్స్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో  ఇళ్ల అమ్మకాలు 

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఇండియా గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ ఏడాది 2008 తర్వాత అత్యధిక ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుత కేలండర్ ఏడాదిలో 2008 కంటే రికార్డు స్థాయిలో 2,60,000 యూనిట్ల ఇళ్లు విక్రయం కావొచ్చని అంచనా వేసింది.జేఎల్ఎల్ ఇండియా 2023 విశ్లేషణ నివేదికలో, మొదటి నెలల్లోనే 1,96,277 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇవి 2022లో జరిగిన మొత్తం అమ్మకాల్లో 91 శాతానికి సమానం. జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్‌బీఐ తీసుకునే చర్యల ఆధారంగా 2024లో తగ్గే అవకాశం ఉండటం వంటి పరిణామాలు నివాస రంగంలో మరింత వృద్ధికి వీలుంటుందని జేఎల్ఎల్ ఇండియా రీసెర్చ్ హెడ్ సమంతక్ దాస్ చెప్పారు.ఇదే సమయంలో కొనుగోలుదారుల నుంచి లభిస్తున్న స్పందనతో బలమైన అమ్మకాలను డెవలపర్లు సాధిస్తున్నారని ఆయన తెలిపారు. రూ. 50-70 లక్షల ధర కలిగిన మిడ్-సెగ్మెంట్ విభాగంలో అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో 45,592 ఇళ్లు విక్రయించబడ్డాయి. దీని తర్వాత 42,919 యూనిట్లతో ప్రీమియం ఇళ్లు(రూ. 1.5-3 కోట్ల మధ్య), తక్కువ సెగ్మెంట్‌లో(రూ. 50 లక్షల కంటే తక్కువ) ఇళ్లు 38,307 యూనిట్లు అమ్ముడయ్యాయి.

అమెజాన్‌లో రియల్‌మి క్రిస్మస్ సేల్

ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు కొట్ట ఆఫర్స్ ను ప్రకటిస్తుంది.. ఈ కంపెనీ క్రిష్టమస్ సేల్ ను ప్రారంభించింది.. అందులో రియల్‌మి ‘క్రిస్మస్ సేల్’లో భాగంగా రియల్‌మి నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ, రియల్‌మి నార్జో ఎన్55, రియల్‌మి నార్జో ఎన్53తో సహా అనేక రకాల మోడల్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ప్రమోషన్‌లు డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 26 వరకు అందుబాటులో ఉంటాయి.. రియల్ మీ కంపెనీ వెబ్ సైట్ లలో కూడా అందుబాటులో ఉన్నాయి..రియల్‌మి నార్జో 60 ప్రో 5జీ డిస్కౌంట్ ధరలు, కూపన్ బెనిఫిట్స్‌తో విభిన్న కాన్ఫిగరేషన్‌లను అందిస్తుంది. సేల్ సమయంలో   ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. 12జీబీ +1టీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 29,999కు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు రూ. 27,999 తగ్గింపు ధరతో పాటు రూ. 2వేల కూపన్ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు..రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీతో పాటు హై-పర్ఫార్మెన్స్ డివైజ్‌లపై భారీగా తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఈ ఫోన్లలో 8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్‌ను కలిగిన నార్జో 60 5జీ, ఇప్పుడు అసలు రూ. 17,999 నుంచి రూ.15,499 ధరకు తగ్గింది. రూ. 2,500 కూపన్ బెనిఫిట్స్ అందిస్తుంది. రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ విషయానికొస్తే.. 6జీబీ+128బీబీ వేరియంట్ ఇప్పుడు రూ. 12,999 తగ్గింపు ధరతో అందిస్తోంది..మరో బడ్జెట్ ఫోన్ రియల్‌మి నార్జో ఎన్55తో పాటు డిస్కౌంట్‌లు, కూపన్‌ల ద్వారా తగ్గింపు ధరలను అందిస్తుంది. వివిధ ధరల బ్రాకెట్‌లలో అనేక ఆప్షన్లను అందిస్తోంది. రియల్‌మి 6జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్‌ను కలిగిన నార్జో ఎన్55 అసలు ధర రూ. 12,999 నుంచి తగ్గడంతో ప్రస్తుతం రూ.9999 రూపాయలకు వస్తుంది..రియల్‌మి నార్జో ఎన్53 అసలు ధర రూ. 8,999 నుంచి రూ. 7,999 తగ్గింపు అందిస్తోంది.. ఈ ఫోన్ పై రూ.1000 రూపాయల వరకు కూపన్ ను పొందవచ్చు..

* ఈ నెలలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందా.. లేదా? 

భారతీయ మార్కెట్లో ప్రతి నెలా మంచి అమ్మకాలతో దూసుకెళ్లిన ఆటోమొబైల్ మార్కెట్.. పాకిస్తాన్‌లో బాగా క్షీణించి.. గత నెలలో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని పీఏఎమ్ఏ (PAMA) వెల్లడించింది. అక్కడ కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటి? ఈ నెలలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందా.. లేదా? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.పాకిస్తాన్‌ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PAMA) ప్రకారం.. పాకిస్తాన్‌లో నవంబర్ 2023లో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇదే నెలలో అక్కడి అమ్మకాలు 15,432 కావడం గమనార్హం.పాకిస్తాన్‌లో కార్ల అమ్మకాలు భారీగా తగ్గడానికి కారణం ‘పెరిగిన ఆర్థిక సంక్షోభం, తారా స్థాయికి చేరిన కార్ల ధరలు, సగటు వ్యక్తి సంపాదన క్షీణించడం’ మాత్రమే కాకుండా పరిశ్రమ డిమాండ్ పడిపోవడం, కరెన్సీ తరుగుదల, అధిక పన్నులు, ఆటో ఫైనాన్సింగ్ వంటివి ఖరీదైనవి కావడం కూడా ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.నిత్యావసర వస్తువులే కొనలేని పరిస్థితిలో ఉన్న ఆ దేశ ప్రజలకు కార్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఈ కారణంగానే పాకిస్తాన్‌లో ఆటోమొబైల్ మార్కెట్ బాగా క్షీణించింది. పాక్ సుజుకి, ఇండస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, హోండా అట్లాస్ కార్ వంటి ప్రధాన వాహన తయారీదారుల అమ్మకాలు వరుసగా 72 శాతం, 71 శాతం, 49 శాతం క్షీణించాయి. మరి కొన్ని సంస్థలు పూర్తిగా ఉత్పత్తి నిలిపివేసి ప్లాంట్స్ కూడా మూసివేసాయి.2023 జులై నుంచి అక్టోబర్ వరకు పాకిస్తాన్‌లో అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 20,871. అంటే నాలుగు నెలల కాలంలో అమ్ముడైన వాహనాల సంఖ్య సగటున ఐదు వేలు మాత్రమే అని స్పష్టమవుతోంది. టూ వీలర్స్, త్రీ వీలర్స్ అమ్మకాలు కూడా బాగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నెలలో కూడా అమ్మకాలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.పాకిస్తాన్‌లో కార్ల అమ్మకాలను పక్కన పెడితే.. భారతదేశంలో కార్ల విక్రయాలు గత నెలలో జోరుగా సాగాయి. నవంబర్ 2023లో మారుతి సుజుకి ఇండియా సేల్స్ 1,64,439 యూనిట్లు, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 17,818 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నెలలో దేశంలో జరిగిన మొత్తం కార్ల అమ్మకాలు 3.60 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ.పాకిస్తాన్‌లో అమ్ముడైన కార్ల సంఖ్య.. భారతదేశంలో సగం రోజులో అమ్ముడైన కార్ల సంఖ్య కంటే తక్కువని తెలుస్తోంది. భారతదేశంలోని ద్విచక్ర వాహన తయారీదారులు నవంబర్‌లో తమ ఫోర్ వీలర్ కౌంటర్‌పార్ట్‌లను అధిగమించారు. ‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్’ (FADA) గణాంకాల ప్రకారం నవంబర్‌లో ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు ఏకంగా 21 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z