Business

విద్యార్థులు వాడే నోట్‌బుక్‌పేపర్‌‌ పై రాజీనామా లేఖ-వాణిజ్య వార్తలు

విద్యార్థులు వాడే నోట్‌బుక్‌పేపర్‌‌ పై రాజీనామా లేఖ-వాణిజ్య వార్తలు

* విద్యార్థులు వాడే నోట్‌బుక్‌పేపర్‌‌ పై రాజీనామా లేఖ

సాధారణంగా రాజకీయాల్లో రాజీనామా అనగానే అధికారిక లెటర్‌ హెడ్‌పై రాసిన లేఖ గుర్తుకొస్తుంది. అదే కార్పొరేట్‌ రంగంలో అయితే ఎక్కువగా  మెయిల్‌ ద్వారా పంపుతుంటారు. కానీ, పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు.. విద్యార్థులు వాడే రూల్డ్‌ నోట్‌బుక్‌ నుంచి తీసుకున్న పేజీలో రాజీనామా లేఖ రాయడం (Handwritten Resignation Letter) అసలు ఊహించుకుంటామా? కానీ, అదే జరిగింది. ఓ ప్రముఖ కంపెనీలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి గీతలున్న కాగితంలో పెన్నుతో రాసి రాజీనామా లేఖను పంపడం ఇప్పుడు వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..ప్రముఖ పెయింట్ల తయారీ కంపెనీ మిత్షీ ఇండియా ‘చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (CFO)’ రింకూ పటేల్‌ రాజీనామా చేశారు. పిల్లల నోట్‌బుక్‌ నుంచి తీసుకున్నట్లుగా ఉన్న ఓ పేజీలో పెన్నుతో రాసిన లేఖను ఆయన కంపెనీకి సమర్పించారు. ఇ-మెయిళ్ల కాలంలో ఇలా ఓ గీతల కాగితంలో రాజీనామా లేఖ రాయడం (Handwritten Resignation Letter) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్లే తాను కంపెనీ నుంచి వైదొలుగుతున్నానని వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు కంపెనీలో పనిచేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఆయన రాజీనామా (Handwritten Resignation Letter) విషయాన్ని ‘బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌’కు మిత్షీ ఇండియా తెలియజేసింది. కొత్త సీఎఫ్‌ఓ నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ పదవిలోకి కొత్తవారు రాగానే సమాచారం అందిస్తామని తెలిపింది. రాజీనామా లేఖ స్క్రీన్‌షాట్‌ను బీఎస్‌ఈ తమ వెబ్‌సైట్‌లో ఉంచింది.

2024 చివరి నాటికి 82,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు

వచ్చే ఏడాది భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 30-40 శాతం వృద్ధి చెందనుందని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తెలిపింది. ఇది ప్రస్తుత ఏడాది కంటే రెట్టింపు. ప్రస్తుతం దేశీయ ఈవీ పరిశ్రమ అమ్మకాల్లో దాదాపు 70 శాతం వాటాను కలిగిన టాటా మోటార్స్, 2024 లో మూడు కొత్త ఈవీ మోడళ్లను విడుదలకు సిద్ధం చేస్తోంది.ధరల పరంగా కూడా ప్రస్తుతం ఉన్న దానికంటే సరసమైన ధరలో లభిస్తాయని, రూ. 8-30 లక్షలకు తగ్గుతాయని కంపెనీ ప్యాసింజర్, ఈవీ విభాగం ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు. ఈ ఏడాది ప్యాసింజర్ వాహన మార్కెట్లో మొత్తం 41 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇది 2022 కంటే 7-8 శాతం వృద్ధి. అయితే, ఈవీ విభాగం మాత్రం రెండింతలతో దాదాపు 90 వేల నుంచి లక్షల యూనిట్ల విక్రయాలను సాధించింది.2022లో 50 వేల ఈవీ అమ్మకాలు నమోదయ్యాయి. 2024లో ఇది మరింత వేగవంతమవుతుందని శైలేష్ చంద్ర వెల్లడించారు. దీనికోసం తాము సరసమైన ధరల్లో కొత్త ఈవీలను తీసుకురావడంపై దృష్టి పెడతామన్నారు. అంతేకాకుండా ఛార్జింగ్ మౌలిక సదుపాయాల్లో ఉన్న అవరోధాలను దాటి 2024 చివరి నాటికి 82,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

భారీగా పెరిగిన అపార్ట్‌మెంట్లకు గిరాకీ

ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం మాత్రమే కాకుండా రియర్ ఎస్టేట్ రంగం కూడా బాగా ఊపందుకుంది. 2023వ సంవత్సరంలో అపార్ట్‌మెంట్లకు గిరాకీ భారీగా పెరిగిందని ‘జేఎల్ఎల్ ఇండియా’ (JLL India) వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఈ సంవత్సరం దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్లకు డిమాండ్ బాగా పెరిగిందని ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, పూణేలలో మొత్తం రెండు లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది.గతం కంటే ఈ ఏడాది 20 శాతం అమ్మకాలు పెరుగుతాయని, 2023 మొదటి తొమ్మిది నెలల్లో అమ్మకాలు 1,96,227 యూనిట్లు అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2022 ఇదే సమయంలో మొత్తం విక్రయాన్ని 1,61,575 యూనిట్లు మాత్రమే అని కూడా నివేదికలో వెల్లడైంది.వచ్చే ఏడాదికి అపార్ట్‌మెంట్‌ అమ్మకాలు 2.9 లక్షల నుంచి 3 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని జేఎల్ఎల్ ఇండియా భావిస్తోంది. మార్కెట్లో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో 2024లో కూడా సేల్స్ తారా స్థాయికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది.అపార్ట్‌మెంట్స్ ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో దేశంలో హోసింగ్ మార్కెట్ సజావుగా ముందుకు సాగుతుందని జేఎల్‌ఎల్‌ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ ‘సమంతక్ దాస్’ తెలిపారు. రానున్న రోజుల్లో ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనం కొనాలనుకుంటున్నారా?

విద్యుత్‌ ద్విచక్ర వాహనం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇయర్‌ ఎండ్‌ సందర్భంగా అనేక ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థలు పెద్దఎత్తున ఆఫర్లు అందిస్తున్నాయి. మరోవైపు ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రెండో దశ (FAME-2) కింద కేంద్రం అందిస్తున్న సబ్సిడీ గడువు త్వరలో ముగియనుంది. దీన్ని మరోసారి పొడిగిస్తారా? అనేది అనుమానమే. దీంతో ఈ నెలలోనే వాహన కొనుగోలుకు ముందడుగు వేయడం మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ విద్యుత్‌ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలని చూస్తుంటే ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి..విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్‌ ఎంపిక చేసిన వాహన కొనుగోళ్లపై రూ.24,000 వరకు తగ్గింపు అందిస్తోంది. ఏథర్‌ 450 ఎస్‌ (Ather 450S), ఏథర్‌ 450ఎక్స్‌ (450X)మోడల్‌ ద్విచక్ర వాహనాలపై రూ.6,500 నగదు ప్రయోజనాలు అందిస్తోంది. అదనంగా రూ.1,500 కార్పొరేట్‌ ఆఫర్‌ ప్రయోజనాలు పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. ‘ఏథర్‌ ఎలక్ట్రిక్‌ డిసెంబర్‌’ ప్రోగ్రామ్‌ కింద కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.5,000 డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు పేర్కొంది. డిసెంబరు 31 వరకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.ఓలా ఎలక్ట్రిక్‌ (Ola electric) ఇయర్‌ ఎండ్‌ ఆఫర్లను ఇప్పటికే ప్రకటించింది. ఓలా ఎస్‌1 ఎక్స్‌+ (Ola S1 X+)పై రూ.20 వేల డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.5 వేల డిస్కౌంట్‌తో పాటు, జీరో ప్రాసెసింగ్‌ ఫీజు, 6.99 శాతం వడ్డీ రేటుకే రుణం వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు పేర్కొంది. హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) కూడా తన విడా విద్యుత్‌ స్కూటర్లపై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ అందిస్తోంది. రూ.7,500 వరకు ఈఎంఐ ప్రయోజనాలు, రూ.8,259 విలువ చేసే బ్యాటరీ వారెంటీ పొడిగింపు, రూ.6,500 డిస్కౌంట్‌, రూ.5,000 ఎక్స్ఛేంజీ బోనస్‌, రూ.7,500 లాయల్టీ డిస్కౌంట్‌, రూ.2,500 కార్పొరేట్‌ డిస్కౌంట్‌, రూ.1,125 విలువచేసే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లతో మొత్తం కలిపి రూ.38,500 వరకు ప్రయోజనాల్ని అందిస్తోంది. దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన FAME-2 గడువు త్వరలో ముగియనుంది. ఫేమ్‌-1కు కొనసాగింపుగా ఫేమ్‌-2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్‌ 1న కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా టూవీలర్‌, త్రీవీలర్‌, ఫోర్‌ వీలర్‌ కొనుగోళ్లపై సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనుంది. స్కీమ్‌ను పొడిగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదిస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ, ఇతర మంత్రిత్వ శాఖలు మాత్రం విముఖత చూపుతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ పథకం పొడిగించకపోతే ఇక సబ్సిడీ నిలిచిపోయినట్లే. వినియోగదారులు పూర్తి సొమ్ము చెల్లించి ఈవీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

* దేశీయ చమురు సంస్థలు ఉపశమనం

ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial LPG cylinder) వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను తగ్గించాయి. 19 కేజీల సిలిండర్‌పై రూ.39.50 తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. తగ్గించిన కొత్త రేట్లు ఈ రోజు అంటే 2023, డిసెంబర్ 22 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి.ధరలు తగ్గిన తర్వాత దేశరాజధాని న్యూఢిల్లీలో రూ.1796.50 ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధర రూ.1,757కు తగ్గింది. ముంబైలో రూ.1,710, కోల్‌కతాలో రూ.1,868, చెన్నైలో రూ.1,929కి స్వల్పంగా తగ్గాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు.

ప్రైమ్ యూజర్స్ కి గుడ్ న్యూస్

అమెజాన్ ప్రైమ్ తమ యూజర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ ధరలను ప్రకటించింది. రూ.999గా ఉన్న అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ మెంబర్షిప్ ను ప్రకటించింది.. ఇక గతంలో ఈ మెంబర్ షిప్ నెలకు రూ.299, 3నెలలకు రూ.599, ఇయర్ ప్లాన్ రూ.1,499గా ఉండేది. ఆ తర్వాత ప్రైమ్ లైట్ ను జూన్ లో ప్రారంభించిన అమెజానల్ ప్రైమ్ ప్లాన్ లో కొన్ని మార్పులను చేస్తున్నట్లు ప్రకటించింది..మామూలు ప్రైమ్ మెంబర్ షిప్ తో పోలిస్తే.. ఇందులో కాస్త ప్రయోజనాలు తక్కువగానే ఉన్నాయి. ఈ ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్ మెంబర్ షిప్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.. అయితే మిగిలిన వాటికి ఎటువంటి తగ్గింపు లేదని చెప్పారు.. సాదారణంగా ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్లు అనేక ప్రయోజనాలను పొందుతూన్నారు.. ధరతోపాటు ప్లాన్ లో కనిపించే మార్పుల విషయానికొస్తే… ఈ ప్లాన్ లో ఇంతకుముందు రెండు రోజుల్లో డెలివరీ చేసేవాళ్ళు.. కానీ ఇప్పుడు మాత్రం వన్ డే లో డెలివరీ అవుతుంది.. అలాగే టు డే డెలివరీ ఉంటుందని చెబుతున్నారు.. కొన్ని వస్తువులకు ఇంకాస్త ఫాస్ట్ గా డెలివరీ ఉంటుందని చెబుతున్నారు..ఇకపోతే ప్రైమ్ వీడియో క్వాలిటీని హెచ్ డీ కి పరిమితం చేయగా.. తాజా ధర తగ్గింపు వల్ల ఈ మెంబర్ షిప్ కేవలం ఒక యూజర్ కి మాత్రమే సపోర్ట్ చేయనుంది. ఇందులో భాగంగా ప్రతి వస్తువుపై రూ.175తో మార్నింగ్ డెలివరీ, నో-కాస్ట్ ఈఎంఐ, 6నెలల ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ వంటివి చాలానే ఉన్నాయి… అంతేకాదు అన్ లిమిటెడ్ ప్రైమ్ వీడియో డివైజ్ సపోర్ట్ తో పాటు, 4కె రిజల్యూషన్ సపోర్ట్ ను కూడా కోల్పోనున్నట్లు ప్రైమ్ ప్రకటించింది..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z