DailyDose

నంద్యాలలో దారుణ హత్య- నేర వార్తలు

నంద్యాలలో దారుణ హత్య

* ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు మాబు, అభినయ్‌(10), వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావుగా గుర్తించారు.

నంద్యాలలో దారుణ హత్య

నంద్యాలలో దారుణ హత్య జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. గ్లాడిస్ అనే రిటైర్డ్ టీచర్‌ను దోపిడీ దొంగలు పాశవికంగా హత్య చేశారు. కళ్ళలో కారం కొట్టి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారికి పెళ్లి చేసి ఆమె ఒంటరిగా నివసిస్తోంది. భర్త మోహన్ సుధాకర్ రావు దూరదర్శన్ లో పనిచేస్తూ రిటైర్మెంట్ తరువాత మృతి చెందారు.ఇద్దరు కూతుర్లు పెళ్లిళ్లు చేసుకొని హైదరాబాద్‌లో స్థిరపడడంతో గ్లాడిస్ ఒంటరిగా ఉంటోంది. దుండగులు పక్కాగా రెక్కీ చేసి టీచర్‌ ఇంటిని టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలిసింది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకుని ఆమె ఇంటికి దొంగలు వెళ్లారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టీచర్‌ కళ్లలో కారం కొట్టి, గొంతుకోసి హత్య చేశారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్‌ టీం సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఎంత సొమ్ము దోచుకెళ్లారనే విషయంపై ఆరా తీస్తున్నారు. భారీగా బంగారం, నగదు అపహరించినట్లు మృతురాలి బంధువులు పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. మృతురాలి కూతుర్లు, బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చిట్టీల పేరుతో సామాన్యులకు టోకరా

కోదాడ కేంద్రంగా జరుగుతున్న చిట్టీ వ్యాపారుల మోసాలకు తెరపడడం లేదు. అవసరానికి ఉపయోగపడతాయని రూపాయి.. రూపాయి జమ చేస్తున్న సామాన్యులను చిట్టీల వ్యాపారులు నిండా ముంచుతున్నారు. 20 నుంచి 30 సంవత్సరాలు ఇదే వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యాపారులు సామాన్యులకు దాదాపు రూ.25కోట్లు కుచ్చుటోపి పెట్టారు.నాలుగు సంవత్సరాల క్రితం కోదాడకు చెందిన సేవా చిట్స్‌ యజమాని రూ.20కోట్లు చెల్లించకుండా మొహం చాటేయగా.. తాజాగా మరో వ్యాపారి దాదాపు రూ.6కోట్ల మేర ఐపీ పెడుతున్నట్లు సమాచారం. ఒక చిట్టీ నిర్వహణకు మాత్రమే అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో చిట్టీలను నడుపుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.తెలివిగా తప్పించుకుంటున్నారు..రిజిస్టర్‌ చిట్టీ ఒకటి మాత్రమే అనుమతి తీసుకొని కోట్ల రూపాయలు చిట్టీలు నడుపుతున్న వీరు బోర్డు తిప్పేస్తే బాధితులకు చిల్లిగవ్వ కూడా రావడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందే వీరు తమ ఆస్తులను ఇతరులకు గుట్టచప్పుడు కాకుండా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు.న్యాయస్థానాలను ఆశ్రయించి ఐపీ దాఖలు చేస్తుండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కోర్టులకు చేరుతున్న వ్యవహారం సంవత్సరాల తరబడి తేలకపోవడంతో బాధితులు పూర్తిగా నష్టపోతున్నారు.కోదాడలో ఇలా ఒక చిట్టీకి మాత్రమే అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో చిట్టీలను నడుపుతున్న సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పంజాగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

పంజాగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా భవనంలోని ఐదు, ఆరు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని భవనంలోని వారందర్నీ బయటకు తరలించారు. ఆరో అంతస్తులో చిక్కుకున్న కుటుంబాన్ని శ్రావణ్‌ అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.

భీమవరంలో టిక్కెట్స్ కోసం థియేటర్లలో గొడవ

ప్రపంచవ్యాప్తంగా సలార్ ఫీవర్ పట్టుకుంది.. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. టికెట్లు దొరకలేదని ఫ్యాన్స్ ఒకవైపు గొడవలకు దిగుతున్నారు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం.. సీజ్ ఫైర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. నేడు ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాలు మధ్య ఈ చిత్రం రిలీజ్ అయ్యింది..ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు.. సినిమా చూసిన వారు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ప్రభాస్ నుంచి ఒక మాస్ బొమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. అరిరిపోయే మాస్ ఎంటర్టైనర్ దొరికినట్లు చెబుతున్నారు.. సినిమా ఓ రేంజులో ఉందంటూ ఫ్యాన్స్ సినిమా హాళ్ళ వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలతో సలార్ షోస్ మొదలయ్యాయి. కానీ ప్రభాస్ సొంత ఊరులో మాత్రం ఒక్క థియేటర్లో కూడా బెనిఫిట్ షో పడకపోవడం గమనార్హం…ఇదిలా ఉండగా.. డార్లింగ్ సొంతూరు భీమవరంలో మాత్రం టికెట్లు డబుల్ రేట్లకు అమ్ముతున్నారని వార్తలు కూడా వినిపిస్తుంది.. ఈ విషయం గురించి అభిమానులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్మాలని థియేటర్ యాజమాన్యాయానికి ఆర్డర్ పాస్ చేశారు. ఈ గొడవల కారణంగా ఇక్కడ బెనిఫిట్ షోలు పడలేదు.. ఒంగోలు గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ లో సలార్ సినిమా చూసిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి.. మూవీ పై తన రివ్యూ ఇచ్చారు. సలార్ మూవీలో సెకండ్ ఆఫ్ బాగుందని, పైట్స్ సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.. ఏలూరు, విజయవాడ, కడప, నెల్లూరు లో కూడా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే టాక్ వినిపిస్తుంది.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

కామారెడ్డిలో దారుణం

కుటుంబ కలహాలతో తండ్రీకొడుకులు కన్నుమూశారు. తండ్రి కత్తితో పొడవడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వెంటనే తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్‌ తండాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. తండాకు చెందిన బాదావత్‌ వసంత్‌రావు (48) కుమారుడు బాదావత్‌ సురేశ్‌ (27) హైదరాబాద్‌లో ప్రైవే టు ఉద్యోగి. రెండ్రోజుల క్రితం తండాకు వ చ్చాడు.బుధవారం రాత్రి డబ్బుల విషయంలో తండ్రీ కొడుకులు గొడవ పడి పరస్పరం దాడి చేసుకున్నారు. ఆగ్రహం చెందిన తండ్రి ఇంట్లోని కత్తితో కొడుకు సురేశ్‌ ఎడమ వైపు ఛాతీపై పొడవగా తీవ్రంగా గాయపడ్డాడు. కు టుంబ సభ్యులు, తండావాసులు చికిత్స ని మిత్తం గాంధారి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సురేశ్‌ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.కాగా, ఇంటి వద్ద ఉన్న తండ్రి వసంత్‌ రావు పురుగు మందు తాగా డు. బంధువులు అతడిని నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. తండ్రీ కొడుకును హత్య చేశాడని ఆగ్రహించిన బంధువులు వసంత్‌రావు ఇంటిని ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రేమ్‌దీప్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z