DailyDose

అయ్యప్ప భక్తులకు శుభవార్త!

అయ్యప్ప భక్తులకు శుభవార్త!

అయ్యప్ప భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 5 నుంచి ఈ సర్వీసు ప్రారంభం కానుందని.. అయ్యప్ప భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిందని, వాటిని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సమయం, టికెట్ ధరను కేటాయించినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉంటామన్నారు.

ఇటీవల అయ్యప్ప భక్తులు ఇబ్బంది ఎదుర్కొన్న సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. ఇక చార్జీలు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి శబరమల వెళ్లే ప్రతి ప్రయాణికుడికి రూ. 13,600 చొప్పున వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు తెలిపింది. జనవరి 5న అంటే శుక్రవారం నాడు లహరి బస్సు MGBS నుండి బయలుదేరుతుందని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

ఆర్టీసీ ప్రకటన ప్రకారం శబరమల బస్సు షెడ్యూల్ ఇలా..

* బస్సు మొదటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు MGBS నుండి బయలుదేరుతుంది.

* 2వ రోజు రాత్రి 7.30 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ సందర్శించిన అనంతరం అదే రోజు రాత్రి 10.30 గంటలకు తిరిగి వస్తారు.

* 3వ రోజు ఉదయం 6.30 గంటలకు గురువాయూర్ చేరుకుంటారు. తిరిగి 12.30 గంటలకు బయలుదేరుతుంది.

* 4వ రోజు ఉదయం 9.20 గంటలకు పంబ చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుంది.

* 4వ రోజు రాత్రి 11.20 గంటలకు ఎరుమేలి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరుతుంది.

* 5వ రోజు ఉదయం 5.20 గంటలకు తిరువనంతపురం చేరుకుంటారు. మళ్లీ రాత్రి 9.20 గంటలకు ప్రారంభమవుతుంది.

* 5వ రోజు సాయంత్రం 5.30 గంటలకు మదురై చేరుకుంటారు. తిరిగి 11.20 గంటలకు బయలుదేరుతుంది.

* 6వ రోజు ఉదయం 7.30 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు తిరిగి వస్తుంది.

* 6వ రోజు సాయంత్రం 6.10 గంటలకు కంచి చేరుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున 2.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతుంది.

* 7వ రోజు ఉదయం 11.10 గంటలకు మహానంది చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 11.30 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి నేరుగా ఎంజీబీఎస్‌కు చేరుకుంటామని ఆర్టీసీ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z