Agriculture

ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న చలి తీవ్రత!

ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న చలి తీవ్రత!

ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా చలి తీవ్రత కొనసాగుతున్నది. పాడేరులో ఆదివారం ఉదయం పది గంటల వరకు మరింత దట్టంగా పొగమంచు కమ్మేసింది. గత మూడు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ, పొగ మంచు ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. ఆదివారం ఏజెన్సీలోని పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో సైతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ పైబడే నమోదయ్యాయి. కానీ పొగమంచు, చలితీవ్రత తగ్గుముఖం పట్టలేదు. దీంతో మన్యం వాసులు ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.

చింతపల్లిలో 14.2 డిగ్రీలు

చింతపల్లి: మన్యంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత తగ్గడం లేదు. ఆదివారం చింతపల్లిలో 14.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు. చలితో పాటు ఉదయం వేళలో మంచు దట్టంగా కురుస్తున్నది. ఉదయం పది గంటల వరకు చింతపల్లి, జీకేవీధి, లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో మంచు తెరలు వీడడం లేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z