NRI-NRT

సింగపుర్‌లో రామయ్య అక్షింతల వితరణ

సింగపుర్‌లో రామయ్య అక్షింతల వితరణ

సింగపూర్‌(Singapore)లో అయోధ్య రాములవారి అక్షింతల వితరణ(Akshinthala Vitharana) మహోత్సవం వైభవంగా జరిగింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) వారు అయోధ్య నుంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అక్షింతలు సింగపూర్‌లో నివసిసిస్తున్న భక్తులకు అందజేశారు. రాములోరి ప్రాణప్రతిష్ట రోజైన జనవరి 22 న ఇక్కడి చాంగి విలేజ్‌లోని శ్రీరాముని గుడిలో ఎంతో వేడుకగా నిర్వహించారు. అక్షింతల వితరణ మహోత్సవం నిర్వహించే అవకాశం దక్కడం సొసైటీకి దక్కిన పుణ్యం అని సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ పవిత్ర కార్యం లో స్థానిక భక్తులందరూ భక్తిశ్రద్ధలతో రామ నామ స్మరణ చేస్తూ ఈ కార్యక్రమం లో పాల్గొని ప్రసాదం తో పాటు అక్షింతలు స్వీకరించి శ్రీ రాముని పూజలో పాల్గొన్నారు. కన్నుల పండువగా అక్షింతల కార్యాక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ బృందాన్ని భక్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్తా నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీతా రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి గోనె నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.


👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z